Early Morning Walk In Winter: వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వాకింగ్ చేయడం తగ్గిస్తారు. కానీ చలికాలంలో వాకింగ్ చేయడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే వాకింగ్ వల్ల కలిగే లాభాలు ఏ సమయంలో వాకింగ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు బర్న్ అవుతాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా వ్యాధులను ఎదిరించే శక్తి పెరుగుతుంది. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది.
చలికాలంలో వాకింగ్ చేయడానికి ఉత్తమ సమయాలు:
సూర్యుడు ఉదయించిన తర్వాత, ఉదయం 7:30 నుండి 9:00 గంటల మధ్య వాకింగ్ చేయడం చాలా మంచిది. ఈ సమయంలో చలి కొంచెం తగ్గుతుంది. సూర్యాస్తమయానికి ముందు, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కూడా వాకింగ్ చేయవచ్చు. ఈ సమయంలో వాతావరణం కొంచెం వెచ్చగా ఉంటుంది.
చలికాలంలో వాకింగ్ చేయకూడని సమయం:
ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య: ఈ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది, ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.
చాలా తీవ్రమైన చలి ఉన్న రోజుల్లో: చాలా తీవ్రమైన చలి ఉన్న రోజుల్లో వాకింగ్ చేయడం మంచిది కాదు.
చలికాలంలో వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు:
వెచ్చని దుస్తులు ధరించండి: తల, చెవులు, చేతులు వంటి భాగాలను బాగా కప్పి ఉంచండి.
మెల్లగా నడవండి: మొదట మెల్లగా నడవడం మొదలుపెట్టి, క్రమంగా వేగాన్ని పెంచుకోండి.
తగినంత నీరు తాగండి: వాకింగ్ చేసే ముందుఅ తర్వాత తగినంత నీరు తాగండి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకోవాలి
వాకింగ్ పాత్: సురక్షితమైన, మృదువైన ఉపరితలం ఉన్న మార్గం ఎంచుకోండి.
సహచరుడు: ఒకరితో కలిసి వాకింగ్ చేయడం మరింత ఆనందదాయకంగా ఉంటుంది.
వెచ్చని ద్రవాలు: వాకింగ్ తర్వాత వెచ్చని కాఫీ లేదా టీ తాగవచ్చు.
ముఖ్యంగా: మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వాకింగ్ చేసే సమయం వ్యవధిని నిర్ణయించుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే వైద్యునిని సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.