Lizards: బల్లి కొరికితే ఏమవుతుందో తెలుసా? ఇంట్లో బల్లులు ఉన్నవారు తప్పకుండా తెలుసుకోండి..

Lizards: బల్లులు అప్పుడప్పుడు కొరుకుతూ ఉంటాయి ఇలా కొరకడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తారు. నిజానికి బల్లి కొరకడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బల్లి కొరికిన వారు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని వారు అంటున్నారు..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 1, 2024, 04:46 PM IST
Lizards: బల్లి కొరికితే ఏమవుతుందో తెలుసా? ఇంట్లో బల్లులు ఉన్నవారు తప్పకుండా తెలుసుకోండి..

Lizards Bite: బల్లులు చాలామంది ఇళ్లలో తరచుగా అక్కడ ఇక్కడ గోడలపై కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అయితే వీటిని చూసి కేకలు వేస్తూ భయపడుతూ ఉంటారు. మరికొందరికి అయితే నువ్వంటే ఎంతో అసహ్యం. ఇక పొరపాటున ఆ పల్లి పైనుంచి కింద పడితే అంతే సంగతులు. చాలామందిని బల్లి అనుకోకుండా వచ్చి కరుస్తూ కూడా ఉంటుంది. బల్లి విషపూరితమైంది గా అందరూ భావిస్తూ ఉంటారు ఇది కరిస్తే ప్రమాదమని అనేక రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే బల్లికరిస్తే చర్మం విషపూరితమై దానిలాగే తయారవుతుందని కూడా అనుకుంటారు. బల్లి నిజంగానే విషపూరితమైందా? బల్లికరిస్తే అనారోగ్య సమస్యలు తప్పవా? బల్లికరిస్తే తొందరపడకుండా ఏం చేయాలో తెలుసా? అయితే ఇప్పుడు బల్లికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

చాలామంది ఇళ్లలో కనిపించే బల్లులు చాలా విషపూరితమని అనుకుంటూ ఉంటారు నిజానికి ఇవి మీరు అనుకున్నంత విషపూరితమైనవి కావు. అంతేకాకుండా అవి శరీరంలోకి ఎలాంటి విషపూరితమైన మూలకాలను వదలవట. కొన్ని రకాల బల్లులు చాలా విషపూరితమైనప్పటికీ అవి అడవుల్లో చాలా అరుదుగా ఉంటాయి. ఇళ్లలో జీవించే బల్లులు మాత్రం విషపూరితమైనవి కావని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణంగా గోడలపై ఉండి చిన్న చిన్న కీటకాలను తింటూ కడుపు నింపుకొంటూ ఉంటాయి. వీటి వల్ల మనుషులకు ఎలాంటి సమస్యలు రావు.. అంతేకాకుండా కీటకాల బెడద కూడా తగ్గుతుంది.

అయితే బల్లులు కాటేయడం డేంజర్ కానప్పటికీ ఇవి రోజు చేసే మలం వల్ల మనుషులకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. వీటి మలంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పొరపాటున ఇది చర్మంపై పడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమందికి బల్లి కొరకడం డేంజర్ కూడా అంటున్నారు. బల్లులు కొరికిన వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇవి తప్పనిసరి: 
బల్లులు కొరికినప్పుడు చాలామంది ఆందోళన పడుతూ.. చాలా ప్రమాదమని కేకలు వేస్తూ ఉంటారు. నిజానికి బల్లి కొరికినప్పుడు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. 

బల్లి కొరికిన తర్వాత ఆ ప్రదేశాన్ని సబ్బుతో బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాంటీ సెప్టిక్ మందులను బల్లి కొరికిన ప్రదేశంలో అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. 

బల్లి కొరికిన ప్రదేశం దురదగా, నొప్పిగా ఉంటే మీరు కావాలనుకుంటే వైద్యులను సంప్రదించడం కూడా చాలా మంచిది.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News