Common Mistakes To Avoid While Fruits: పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వాటిని తినమని సూచిస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు వ్యాధుల నుంచి శరీరాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా చాలా మంది బరువు తగ్గే క్రమంలో డైట్‌లో వినియోగిస్తారు. పండ్లలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా చాలా ప్రభావవంతంగా ఉపయోగపడతాయి. అయితే పండ్లు తినే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పండ్లు తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
పండ్లు కలిపి తినడం:
ఇతర ఆహార పదార్థాల కంటే పండ్లు మన శరీరంలో వేగంగా జీర్ణమవుతాయి. దీంతో చాలా రకాల వ్యర్థాలు కూడా ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో అన్ని పండ్లను మిక్స్ చేసుకోని తినడం మానుకోండి. ఇలా చేయడం వల్లే జీర్ణ క్రియ అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటుంది.
రాత్రిపూట పండ్లను తినడం:
రాత్రి నిద్రించడానికి 3 గంటల ముందు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళా తీసుకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయిని, దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలా రాత్రి పూట తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి. కొందరిలో ఎసిడిటీ సమస్య కూడా రావొచ్చు.
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం:
చాలా మంది పండ్లు తిన్న వెంటనే నీరు తాగుతారు. ఇలా క్రమంగా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలేకాకుండా.. ఎసిడిటీ సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే పండ్లు తిన్న తర్వాత నీటిని తాగొద్దు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Prabhas Marriage : రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. రామ్ చరణ్‌పై ప్రభాస్ కామెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?
Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook