Cholesterol: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైందని అర్థం..

Cholesterol symptoms: మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వేధిస్తాయి.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగాయి అని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి...

Written by - Renuka Godugu | Last Updated : Nov 28, 2024, 08:02 PM IST
Cholesterol: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైందని అర్థం..

Cholesterol symptoms:  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని ముందుగానే పసిగట్టెయ్యవచ్చు. మనిషి శరీరంలో ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల స్థాయిలు ఎక్కువగా ఉండి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గించుకోవాలి. లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ స్థాయిలో పెరుగుతాయి. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినాయి అని చెప్పే కొన్ని సంకేతాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది ఒక లక్షణంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఇలాంటి లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి. వెంటనే లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం వైద్యులకు సంప్రదించ వంటివి చేయాలి... లేకపోతే ఇది గుండె సమస్యలను తీసుకువస్తుంది.

కాళ్ల నొప్పి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు కాళ్ళ నొప్పులు అనుభవిస్తారు. ఎందుకంటే కాళ్లలో రక్త సరఫరా సరిగా ఉండదు రక్త కణాలు సన్నగా మారిపోతాయి. ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.. లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేసుకోవాలి... ఆకుకూరలు, పండ్లు డైట్ లో చేర్చుకోవాలి.

రాత్రి సమయంలో చెమట..
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు రాత్రి సమయంలో విపరీతంగా చెమటలు పడతాయి. ఒక్కోసారి ఇది విపరీతమైన స్ట్రెస్ వల్ల కూడా కలుగుతుంది. దీంతో నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి..

నిద్రలేమి..
మన రక్త కణాలు సన్న పడినప్పుడు రక్త సరఫరా సరిగా ఉండదు. దీంతో నీరసం కూడా వస్తుంది. రాత్రి సమయంలో సరిగా నిద్ర పోయినా కానీ కొంత మందిలో రోజంతా నిద్ర లక్షణాలు కనిపిస్తాయి.. ఒక్కోసారి హార్ట్ ఎటాక్ దారితీస్తుంది. ఎందుకంటే రక్తం గుండెకు చేరకుండా ఈ కొలెస్ట్రాల్ అడ్డుపడతాయి.

ఇదీ చదవండి:  అక్కినేని అఖిల్‌ పెళ్లి ఆరోజే ఫిక్స్‌.. జైనబ్‌ మంచి అమ్మాయి: నాగార్జున

ఛాతిలో నొప్పి..
చెడు కొలెస్ట్రాల స్థాయిలు పెరిగినప్పుడు రక్త నాళాలు సన్నబడి పోతాయి.. దీంతో ఛాతిలో నొప్పి అనుభవిస్తారు... కొంత మందిలో తరచూ ఈ ఛాతి నొప్పి ఉంటుంది. ఒక్కోసారి ఇది గుండె నొప్పిగా కనిపిస్తుంది. పరిస్థితి చేయి జారిపోతే  ఇది గుండె నొప్పులకు దారితీస్తుంది హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది... ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే రక్త నాళాలు సన్న పడిపోయి కొలెస్ట్రాల్ పేరుకుంటుంది... దీనికి మంచి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి.

ఇదీ చదవండి: తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్ష జవాబు కీ.. ఈ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోండి..

ఇవి కాకుండా ప్రతిరోజూ నడక, లేదా చిన్న చిన్న ఎక్సర్‌సైజులు వంటివి చేయాలి. డిటాక్స్‌ డ్రింక్స్‌ ఉంటాయి. వీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News