Maha Kumbhmela 2025: ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాకు భక్తులు రోజురోజుకు మరింత పెరిగుతున్నారు. తొలి రోజు సోమవారం కోటిన్నర మంది భక్తులు రాగా.... రెండో రోజు ఏకంగా మూడున్నర కోట్ల మంది గంగ, యమున, సరస్వతి నదుల కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల మందికి పైగా మహా కుంభమేళాలో పాల్గొన్నారని అధికారులు లెక్క తేల్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ జన సందోహంగా మారింది. వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు.. దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
మహా కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జెయిన్‌కి చెందిన రాధే పూరి బాబా.. ఆయన తపస్సును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ బాబా గత 15 ఏళ్ల నుంచి తన చెయ్యి పైకి ఎత్తి గాల్లో ఉంచారు. బాబా తపస్సు కారణంగా ఆయన చెయ్యి పని చేయకుండా అయిపోయింది. ఇప్పటికీ ఆ చేయి కిందికి పెట్టుకోవడానికి రావడం లేదు. ఆయన చేతి వేళ్లు ఒక దానితో ఒకటి దగ్గరకు ముడుచుకున్నాయి. గోర్లు కూడా తీసుకోకపోవడంతో అవి రింగులు తిరిగాయి. ఇది ఒక కఠోర తపస్సుగా చెప్పుకోవచ్చు. విశ్వకల్యాణం కోసం ఈ తపస్సు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చోటూ బాబా.. అస్సాంలోని కామాఖ్య పీఠ్‌కు చెందిన 57 ఏళ్ల సన్యాసి ఛోటూ బాబా యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత మూడు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఈ బాబా కేవలం 3 అడుగుల 8 అంగుళాల ఎత్తుఉంటారు. గంగాపురి మహారాజ్ అని కూడా పిలువబడే ఛోటూ బాబా.. మహా కుంభ ఉత్సవానికి హాజరయ్యే భక్తులను, సందర్శకులను ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత 32 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అసాధారణ ప్రతిజ్ఞ చేసి నెరవేరని కోరికతో ఇలా స్నానం చేయకుండా ఉండిపోయారు.
బాబా అమర్జీత్ ‘అనాజ్‌వాలీ బాబా’గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.
మరొకరు హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. చాబీవాలే బాబా అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళం చెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్‌రాజ్‌లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు.
మహాకుంభ మేళాకు రుద్రాక్షల బాబా కూడా చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11వేల రుద్రాక్షలు ఉన్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు.ఇదిలా ఉంటే మహాకుంభమేళాలో ఈబాబాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు.. దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.