300 kms traffic jam: ప్రపంచంలో అతి పెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కి.మీల మేర నిల్చిపోయిన వాహానాలు.. వీడియో వైరల్..

World biggest traffic jam: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లే మార్గంలో ఎక్కడ చూసిన వాహానాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భక్తులు రోడ్లపైన వంటలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 10, 2025, 03:36 PM IST
  • కుంభమేళలో భారీ ట్రాఫిక్ జామ్..
  • సంచలన ట్విట్ చేసిన అఖిలేష్ యాదవ్..
300 kms traffic jam:  ప్రపంచంలో అతి పెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కి.మీల మేర నిల్చిపోయిన వాహానాలు.. వీడియో వైరల్..

Maha kumbh mela 300 km traffic jam video: కుంభమేళకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడి మహాకుంభమేళ కావడంతో మన దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కన్పిస్తుంది. ప్రయాగ్ రాజ్ కు ఇప్పటికే చాలా మంది రైళ్లు,విమానం, ప్రత్యేక వాహానాలు, సొంత వాహానాల్లో చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కుంభమేళకు వెళ్లే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే మార్గాలు కూడా ఫుల్ బిజీ అయిపోయాయి.

దాదాపు.. 300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే ఎంతగా భక్తులు వస్తున్నారో అర్థం చేసుకొవచ్చు. దాదాపు.. ఈ భక్తులు రోజుల తరబడి రోడ్లపైన తమ వంతుకోసం వేచి చూస్తున్నారు. వంట వార్పులు చేసుకుంటున్నారు. ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించే తిరిగి రావాలని భక్తులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా యోగి సర్కారు చర్యలు చేపట్టింది.

 

ప్రయాగ్ రాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్ 40 కి.మీ,  గౌహానియా 18 కి.మీ, వారణాసి మార్గంలో 12 నుంచి 18 కి.మీ.ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూపీ పోలీసుల నుంచి అనుమతి వస్తేనే.. మధ్య ప్రదేశ్ పోలీసులు తమబార్డర్ నుంచి యూపీలోకి వాహానాలను అనుమతిస్తున్నారు. ప్రత్యేక అధికారులు నిరంతరం వార్ రూమ్ నుంచి యూపీలోని భక్తుల కదలికల్ని గమనిస్తున్నారు. అధికారులు షిఫ్ట్ ల వారిగా పనిచేస్తున్నారు.

అయితే కుంభమేళకు వచ్చే భక్తులు సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. మరో రెండు షాహీస్నానాలు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ క్రమంలో కుంభమేళకు  పిబ్రవరి 12, మఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహా  శివరాత్రి రోజు కూడా ఇంకా భక్తులు వస్తారని సమాచారం. ఇప్పటి వరకు దాదాపు.. 44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తొంది.

Read more: ద్రౌపది ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు.. వీడియో ఇదే..

కుంభమేళలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్, భక్తుల ఇక్కట్లపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా యోగి సర్కారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం కుంభమేళను నిర్వహించంతో ఫెయిల్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు సమర్థవంతుడికి బాధ్యతలు అప్పగిస్తారన్నారు. ఇప్పటికైన యోగి దీనిపై తగిన విధంగా నైతిక బాధ్యత వహిస్తు నిర్ణయం తీసుకొవాలన్నారు.కుంభమేళలో నెలకొన్న ట్రాఫిక్ జాబ్ వీడియోలను తన అకౌంట్ లో షేర్ చేసి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News