India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. భారీగా తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత దేశంలో ఒక్కరోజులో 50 వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో సోమవారం ( అక్టోబరు 19న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 46,791 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 587 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,97,064 కి చేరగా.. మరణాల సంఖ్య 1,15,197 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు
దేశవ్యాప్తంగా సోమవారం కరోనాతో 69,721 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 67,33,329 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 7,48,538 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 88.63 శాతం ఉండగా.. మరణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 9.87 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Haj 2021: ఆ తర్వాతే హజ్ యాత్రపై నిర్ణయం: కేంద్ర మంత్రి నఖ్వీ
ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 10,32,795 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. అ టెస్టులతో కలిపి అక్టోబరు 19 వరకు మొత్తం 9,61,16,771 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Telangana Covid-19: కొత్తగా 1,486 కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe