కస్టమ్స్ అధికారులు ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నా.. విదేశాల నుంచి భారత్ లోకి బంగారం స్మగ్లింగ్ కి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 100 కిలోలకుపైగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ (డీఆర్ఐ) విభాగం అధికారులు పట్టుకోవడమే అందుకు ఉదాహరణ. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ సిటీలతోపాటు సిలిగురి, మధురై వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో డీఆర్ఐ విభాగం అధికారులు జరిపిన సోదాల్లో ఈ బంగారం పట్టుబడినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
48గంటల్లో క్వింటాల్‌కి పైగా బంగారం సీజ్