Delhi Election 2025 Results: ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ హిట్, విజయం దిశగా బీజేపీ

Delhi Election 2025 Results: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రచారం సూపర్ హిట్ అయిందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2025, 12:15 PM IST
Delhi Election 2025 Results: ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ హిట్, విజయం దిశగా బీజేపీ

Delhi Election 2025 Results: ఢిల్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తరువాత బీజేపీ అధికారం కైవసం చేసుకోనుంది. బీజేపీ తరపున ఎన్డీయే మిత్రపక్షాల ప్రచారం ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం బాగా కలిసొచ్చింది. ఎందుకంటే చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయం దిశగా దూసుసుపోతోంది. 

డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగోసారి పీఠం అధిరోహించాలనే ఆప్ ఆశలకు కళ్లం పడింది. బీజేపీ 26 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠం అధిరోహించనుంది. ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ హిట్ అయ్యారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రచారం చేసిన షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో బీజేపీ పూర్తి స్థాయి ఆధిక్యంలో ఉంది. భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. 

తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గాలతో చంద్రబాబు ప్రచారం కలిసొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాలతో పాటు న్యూ ఢిల్లీలో కూడా తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువ. ఈ నియోజకవర్గంపై కూడా చంద్రబాబు ప్రచారం ప్రభావం పడింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. 

Also read: Delhi Election Results 2025 Live: దూసుకెళ్తున్న బీజేపీ.. ఓటమి దిశగా ఆప్.. కాంగ్రెస్ డకౌట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News