Delhi Assembly Elections 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఒకేసారి 8మంది ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.   

Written by - Bhoomi | Last Updated : Jan 31, 2025, 06:36 PM IST
Delhi Assembly Elections 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఒకేసారి 8మంది ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌కు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పెద్ద దెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీని వీడిన ఈ ఎమ్మెల్యేలకు ఆప్ టిక్కెట్లు ఇవ్వలేదు.

ఇప్పటి వరకు ఈ  ఎమ్మెల్యేలు పార్టీని వీడారు:

1. భావనా ​​గౌర్, పాలం 

2. నరేష్ యాదవ్, మెహ్రౌలీ

3. రాజేష్ రిషి, జనక్‌పురి

4. మదన్ లాల్, కస్తూర్బా నగర్ 

5. రోహిత్ మెహ్రౌలియా, త్రిలోక్‌పురి

6. B S జూన్, బిజ్వాసన్

7. పవన్ శర్మ, ఆదర్శ్ నగర్

 

Also Read: Pm Modi On Budget 2025:  మోదీ మాటల అర్థం అదేనా? మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో అదిరే గిఫ్ట్!

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నిజాయితీ సిద్ధాంతాలకు పూర్తిగా దూరమైందని అంటున్నారు. అవినీతి నిర్మూలన పునాదిపై నిర్మించిన పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోతోందని ఆరోపణలు చేశారు. నిజాయతీ రాజకీయాల కోసమే పార్టీలో చేరానని, అయితే నిజాయితీ ఎక్కడా కనిపించడం లేదని మెహ్రౌలీ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యే నరేష్ యాదవ్ తన రాజీనామాలో రాశారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా ఉద్యమం నుంచి భారత రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని తగ్గించలేకపోయింది కానీ అవినీతి ఊబిలో కూరుకుపోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. 

Also Read: Gold Rates Rise: బంగారం కొనేవారికి నిర్మలమ్మ షాకింగ్ న్యూస్.. బడ్జెట్ వేళ కేంద్రం కీలక నిర్ణయం?  

మరోవైపు, కస్తూర్బా నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని తన రాజీనామాలో రాశారు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాట్లు తెలిపారు. ఎన్నికల ముందు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం కేజ్రివాల్ కు బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News