JP Nadda: కరోనా విషయంలో ట్రంప్ విఫలం: బీజేపీ చీఫ్ నడ్డా

కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.

Last Updated : Nov 6, 2020, 11:32 AM IST
JP Nadda: కరోనా విషయంలో ట్రంప్ విఫలం: బీజేపీ చీఫ్ నడ్డా

JP Nadda said Trump failed US but PM Modi saved India from Covid-19: పాట్నా: కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు. కరోనావైరస్ సమస్యపై ట్రంప్ లేనిపోని విధంగా మాట్లాడి.. ఎన్నికల్లో వెనుకబడ్డారని జేపీ నడ్డా తెలిపారు. బీహార్‌లో (Bihar Assembly election 2020)  చివరిదశ ఎన్నికలు శనివారం జరగనున్న నేపథ్యంలో.. గురువారం దర్బంగాలో జరిగిన ప్రచార ర్యాలీలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Kamal Haasan: రజనీకాంత్ మద్దతు కోరుతున్నాం..

కరోనావైరస్ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని దేశవ్యాప్తంగా లాక్డౌన్‌ను అమలు చేశారని నడ్డా గుర్తుచేశారు. ఇలా చేయడం వల్లనే ఆయన దేశంలోని 130 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగారని పేర్నొన్నారు. ప్రస్తుతం అమెరికా ఫలితాలు వెలువడుతున్నాయని.. అయితే కరోనా విషయంలో విఫలమయ్యారనే ఆరోపణల వల్లనే ఆయన ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారని పేర్కొన్నారు.  కరోనా ప్రారంభంలో మన దేశంలో పూణేలో ఒక టెస్టింగ్ ల్యాబ్ మాత్రమే ఉందని.. ఇప్పుడు ప్రతిరోజూ 15 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వెంటిలేటర్లు, ఫేస్ మాస్క్‌లను కూడా తయారు చేస్తున్నామని బీజేపీ చీఫ్ నడ్డా పేర్కొన్నారు. Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్

ఇదిలాఉంటే.. బీహార్‌లో శనివారం 15 జిల్లాల్లో 78 స్థానాలకు మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. మూడవ దశకు సంబంధించి గురువారంతో ప్రచారం ముగిసింది.  Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News