International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవ కోట్స్, విషెస్, మెసేజ్‌లు ఇవే.. థీమ్ ఇదే!

International Yoga Day 2022 Theme, Wishes and Messages. అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్.. స్నేహితులు, బందువులకు పంపాల్సిన కోట్స్, విషెస్, మెసేజ్‌లన ఓసారి తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 08:49 PM IST
  • జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 థీమ్
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం కోట్స్, విషెస్
International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవ కోట్స్, విషెస్, మెసేజ్‌లు ఇవే.. థీమ్ ఇదే!

International Yoga Day 2022 Theme, Wishes and Messages: మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి 'యోగా' ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి. జూన్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తుంటారు. 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా  మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈసారి ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది.  ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్.. స్నేహితులు, బందువులకు పంపాల్సిన కోట్స్, విషెస్, మెసేజ్‌లన ఓసారి తెలుసుకుందాం. 

థీమ్:
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'మానవత్వం కోసం యోగా' అనే ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. భారతదేశ వ్యాప్తంగా 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ప్రధాన కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో జరుగుతుంది.  గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'ఆరోగ్యానికి యోగా' అనే ఇతివృత్తంతో నిర్వహించారు. 

కోట్స్:
# యోగా మనల్ని లోపలి నుంచి చూసే అద్దం. యోగా ప్రేమికులందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
# రోజూ చేయండి యోగా.. ఏ అనారోగ్యం మీ దారికి రాదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
# మీరు జీవితంలోని ఆందోళనను జయించాలనుకుంటే.. క్షణంలో జీవించండి, శ్వాసలో జీవించండి
# అద్భుతమైన జీవితం కోసం మీ చక్రాలను యోగాతో శుభ్రంగా ఉంచండి. 
# మనమందరం ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాము, అయితే మన స్వంత మనస్సులలో శాంతిని నెలకొల్పితే తప్ప ప్రపంచ శాంతి ఎప్పటికీ సాధించబడదు
# మీకు ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు దినచర్యను కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. 

మెసేజ్‌లు:
# సంతోషకరమైన ఆత్మ, తాజా మనస్సు మరియు ఆరోగ్యకరమైన శరీరం. యోగాతో ఈ మూడింటిని సాధించవచ్చు. మీకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
# ప్రకృతి వేగాన్ని స్వీకరించండి. యోగారహస్యం సహనం. మీకు మరియు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
# యోగా అనేది కాంతి, మీరు ఒకసారి వెలిగించగలిగితే ఎప్పటికీ మసకబారదు
# ఎక్కువ తినేవాడికి, అస్సలు తిననివాడికి యోగా సాధ్యం కాదు
# దైనందిన జీవితంలో శరీరానికి అవసరమయ్యే ఆనందానికి ద్వారం యోగా
# యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు ద్వారా శాంతిని పొందే మార్గం.

Also Read: Naga Chaitanya Dating: టాలీవుడ్‌ యువ హీరోయిన్‌తో నాగ చైతన్య డేటింగ్.. ఎవరో తెలిస్తే షాకే?

Also Read: Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News