శీతాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతుంటాయి. గొంతులో నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. గొంతు గరగరగా ఉండి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలనేది తెలుసుకుందాం.
చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని ప్రతి కిచెన్‌లో లభించే పదార్ధాలతోనే దూరం చేయవచ్చు. గొంతులో గరగర సమస్య ఉన్నా..నొప్పి లేదా మంటగా ఉన్నా, జలుబు, దగ్గు సమస్యలున్నా సరే ఈ హోమ్ రెమిడీస్ సహాయంతో ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీబయోటిక్ గుణాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆ చిట్కాలేంటో చూద్దాం.
అల్లం
అల్లం గొంతుకు చాలా మంచిది. అల్లం కేవలం గొంతు మంటను దూరం చేయడమే కాకుండా గొంతు గరగర లేకుండా చేస్తుంది. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్లో ఉడకబెట్టి తాగాలి. ఇందులో తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. రోజుకు 2-3 సార్లు తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
తేనె
తేనె గొంతు ఇన్ఫెక్షన్ దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అద్భుతంగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు సమస్యను దూరం చేస్తాయి. తేనెను అల్లం మిశ్రమంతో కలిపి తీసుకుంటే గొంతు గరగర సమస్య దూరమౌతుంది. గొంతు నొప్పి, మంట కూడా తొలగిపోతాయి.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలు దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు దోహదపడతాయి. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. దగ్గు, మంట, నొప్పిని తగ్గిస్తాయి. నల్ల మిరియాలు పౌడర్‌గా చేసుకుని నీళ్లలో లేదా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
హింగ్
హీంగ్ అనేది దగ్గు, జలుబు సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా ఉంటుంది. హీంగ్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందుకు దోహదపడతాయి. వేడి నీళ్లో హీంగ్, అల్లం, తేనె కలుపుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
పసుపు
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి. వేడి నీళ్లలో పసుపు కలిపి తాగడం వల్ల గొంతు మంట, గరగర సమస్యలు దూరమౌతాయి.
Also read: Diabetes Patient: చలి కాలంలో మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఇవి చేయాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook