Diet Plan for Monsoon Season: వర్షాకాలంలో వీటిని ఆహారంగా తీసుకుంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..!

Diet Plan for Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. చాలా మంది ఈ వానా కాలం వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రుతుపవనాల రాక వల్ల  కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 03:57 PM IST
  • వర్షాకాలంలో జామ, నిమ్మ ఆహారంగా తీసుకుంటే..
  • శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
  • వర్షాకాలంలో హెర్బల్ టీ తాగడం కూడా మంచిది
 Diet Plan for Monsoon Season: వర్షాకాలంలో వీటిని ఆహారంగా తీసుకుంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..!

Diet Plan for Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. చాలా మంది ఈ వానా కాలం వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రుతుపవనాల రాక వల్ల  కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పలు రకాల ఆహార జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆహార నియమాలను తప్పకుండా తిసుకోండి:

వర్షాకాలంలో జామ, నిమ్మ, నారింజ పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే గుణాలు వానా కాలంలో శరీరాన్ని వ్యాధుల సంక్రమణ నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

హెర్బల్ టీ తాగడం కూడా మంచిది:

వర్షాకాలంలో శరీరానికి మంచి ప్రయోజనాలను ఇచ్చే వాటిలో మసాలా టీ కూడా ఒక భాగమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శరీరానిరానికి వేడిని అందిస్తుంది.

చల్లని వస్తువులను అస్సలు తీసుకోకండి:

వర్షాకాలంలో ఐస్‌క్రీం, పెరుగు, కుల్ఫీ వంటి వాటిని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి వర్షాకాలంలో శరీరానికి హాని కలిగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తృణధాన్యాలు:

వానా కాలంలో ఆహారంలో తృణధాన్యాలు మూంగ్, మొక్కజొన్న, బార్లీ వంటి పప్పుధాన్యాలు చేర్చడం వల్ల శరీరానికి చాలా రకాల లభాలు చేకూరుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తినండి:

వర్షాకాలంలో పచ్చి కూరగాయలు మార్కెట్‌లో విరివిగా లభిస్తాయి. పచ్చి కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల లభాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News