Prakash Raj Birthday: ప్రకాష్‌రాజ్ కెరీర్ గురించి ఎవ్వరికీ తెలియని అంశాలు, ఆరు సార్లు బ్యాన్ అయ్యాడా

Prakash Raj Birthday: దక్షిణాది అగ్రనటుడైన ప్రకాష్‌రాజ్ పేరు తెలియనివాళ్లెవరూ ఉండరు. అద్భుతమైన నటన, ఏ పాత్రలోనైనా లీనమయ్యే గుణం, డైలాగ్ డెలివరీలో ప్రకాష్‌రాజ్‌కు సాటి లేరెవరూ. ఇవాళ ప్రకాష్‌రాజ్ 58వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని గురించి మీకెవరికీ తెలియని ఆసక్తికర అంశాలు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2023, 10:49 AM IST
Prakash Raj Birthday: ప్రకాష్‌రాజ్ కెరీర్ గురించి ఎవ్వరికీ తెలియని అంశాలు, ఆరు సార్లు బ్యాన్ అయ్యాడా

Prakash Raj Birthday: ఇటు దక్షిణాది అటు ఉత్తరాది రెండింట్లోనూ అద్భుతమైన నటన సామర్ద్యాన్ని చాటుతున్న దక్షిణాది నటుడు ప్రకాష్‌రాజ్. సింగమ్‌తో బాలీవుడ్‌లో స్థానం సంపాదించుకున్న ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు ఇవాళ మార్చ్ 26. 1965లో పుట్టిన ప్రకాష్‌రాజ్ ఇవాళ 58వ జన్మదినం జరుపుకుంటున్నాడు. 

రాజకీయాలపై వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రకాష్‌రాజ్..ఎక్కువగా విలన్ పాత్రల్నే పోషించినా అన్ని పాత్రల్లో లీనమయ్యే స్వభావం, ఆకట్టుకునే నటనా సామర్ధ్యం అతడికి సొంతం. కేవలం నటనే కాకుండా పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ప్రకాష్‌రాజ్ నటన ఎంత గొప్పదంటే ఇప్పటి వరకూ 5 సార్లు నేషనల్ ఫిలిం అవార్డులు, 8 నంది అవార్డులు, 8 తమిళనాడు రాష్ట్ర ఫిలిమ్ అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు, 4 సైమా అవార్డులు, 3 సినిమా పురస్కారాలు, 3 విజయ్ పురస్కారాలు గెల్చుకున్నాడు

బాలీవుడ్ అగ్ర నటులతో కలిసి

ప్రకాష్‌రాజ్ తన కెరీర్‌ను 1994లో తమిళ సినిమా డ్యూయట్‌తో ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, తుషార్ కపూర్‌తో కలిసి నటించాడు. 2004లో ఖాకీలో నటించాడు. 1994లో ప్రకాష్ రాజ్ నటి లలితా కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2009లో కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రకాష్‌రాజ్ కెరీర్ ప్రారంభరోజుల్లో ఎంత కష్టపడేవాడంటే..థియేటర్‌లో నెలకు 300 రూపాయలకు పనిచేసేవాడు.

ఆరు సార్లు నిషేధం

ప్రకాష్‌రాజ్ కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, హిందీ సినిమాల్లో పనిచేశాడు. ఇవాళ్టికీ ప్రకాష్‌రాజ్ విలన్ పాత్ర శక్తివంతమైందిగా ఉంటుంది. తన చెడు ప్రవర్తన కారణంగా ప్రకాష్‌రాజ్‌ను ఇప్పటి వరకూ ఆరుసార్లు సినీ పరిశ్రమ బ్యాన్ చేసింది. ప్రకాష్ రాజ్‌పై విధించిన బ్యాన్‌ను చాలామంది దర్శక నిర్మాతలు వ్యతిరేకించారు కూడా.

Also read: Sreemukhi Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో శ్రీముఖి అందాల జాతర.. బరువైన అందాలు ఆరబోసిందిలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News