Salaar Movie: కేజీఎఫ్ 2 థియేటర్లలో 'సలార్' సందడి.. ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్‌! వచ్చే నెలలో బిగ్ ట్రీట్..

Salaar Teaser released in May. త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 06:23 PM IST
  • కేజీఎఫ్ 2 థియేటర్లలో 'సలార్' సందడి
  • ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్‌
  • వచ్చే నెలలో సలార్ బిగ్ ట్రీట్
Salaar Movie: కేజీఎఫ్ 2 థియేటర్లలో 'సలార్' సందడి.. ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్‌! వచ్చే నెలలో బిగ్ ట్రీట్..

 Prabhas, Prashanth Neel movie Salaar Glimpse in Yash starrer KGF Chapter 2 Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'కేజీయఫ్ చాప్టర్ 2' సినిమా మేనియా నడుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్‌తో దూసుకుపోతుంది. కేజీయఫ్ 2 సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుటున్నారు. దాంతో ఎక్కడచూసినా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులో రన్ అవుతున్నాయి. సినిమా భారీ విజయం అందుకోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేజీయఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 

కేజీయఫ్ చాప్టర్ 2 విడుదల సందర్భంగా 'సలార్' సినిమా గ్లిమ్స్ ను థియేటర్లలో ప్రదర్శించారు. 'మోస్ట్ వయెలెంట్ మ్యాన్' అని స్క్రీన్‌పై బొమ్మ పడగానే.. థియేటర్లో అభిమానులు సందడి చేశారు. ఈలలు, కేకలతో థియేటర్ను దద్దరిల్లేలా చేశారు. ప్రభాస్ కటౌట్ చూసి ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్ శృతి హాసన్ లుక్‌ని కూడా రివీల్ చేశారు. శృతి కరాటే చేస్తూ ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు. కేజీఎఫ్ 2 థియేటర్లలో ప్రభాస్ కనబడగానే ఫాన్స్ ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న మూవీ 'సలార్'. ఈ సినిమాను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

శృతి హాసన్, జగపతి బాబు వంటి స్టార్లు సలార్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను హొంబలె ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 2023లో మూవీని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషనల్లో వస్తున్న సలార్‌పై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Also Read: KGF 2 Review: KGF 2 ఓ చెత్త సినిమా- ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలి: ఫిల్మ్ క్రిటిక్ KRK

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x