Brahma Anandam Movie Review: ‘బ్రహ్మా ఆనందం’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

Brahma Anandam Movie Review: ‘బ్రహ్మా ఆనందం’  హాస్య నట చక్రవర్తి బ్రహ్మానందం తన పేరుతోనే తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్  ఈ సినిమాలో తాత మనవళ్లుగా యాక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో  చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 14, 2025, 09:36 AM IST
Brahma Anandam Movie Review: ‘బ్రహ్మా ఆనందం’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

మూవీ రివ్యూ: బ్రహ్మా ఆనందం (Brahma Anandam)
నటీనటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, దివిజ ప్రభాకర్ తదితరులు
సంగీతం: శాండిల్య
సినిమాటోగ్రఫీ: మితేష్ పర్వతనేని
ఎడిటర్: ప్రణీత్ కుమార్
బ్యానర్స్: స్వధర్మం ఎంటర్టైన్మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
దర్శకత్వం: RVS నిఖిల్
రన్ టైమ్ : 2 గంటల 28 నిమిషాలు
విడుదల తేది: 14-2-2025

ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత బ్రహ్మానందం సినిమాలను దాదాపు తగ్గించేసారు. ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉంటేనే చేస్తున్నారు. ఇపుడు చాలా కాలం తర్వాత ఆయన ప్రధాన పాత్రలో తన తనయుడు రాజా గౌతమ్ తో కలిసి తన పేరుతో ‘బ్రహ్మా ఆనందం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. నేడు ప్రేమికులు దినోత్సవం రోజున ఈ సినిమాను విడుదల చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

స్టోరీ విషయానికొస్తే.. బ్రహ్మానందం (రాజా గౌతమ్) నటుడు కావాలని కోరిక. అందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మిగతా పనులు ఏమి  చేయకుండా.. థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే ఉంటాడు. మరోవైపు బ్రహ్మానందం తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం రాసిన నాటకం నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో సెలెక్ట్ అవుతుంది. దానికి డిపాజిట్ కింద రూ. 6 లక్షలు అమౌంట్ జమ చేయాల్సి ఉంటుంది. దీని కోసం అతని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఈ క్రమంలో తను  ప్రేమించిన ప్రియురాలికి దూరం కావాల్సి వస్తోంది. మరోవైపు ఆనంద్ రామ్మూర్తి తన దగ్గర భూమి ఉంది. నేను చెప్పినట్టు చేస్తే ఆ డబ్బులు ఇస్తానంటాడు. ఈ క్రమంలో బ్రహ్మానందం.. ఆనంద్ రామ్మూర్తి ఊరికి వెళతారు. ఈ క్రమంలో ఏం జరిగింది. తాను కోరుకున్న ఆరు లక్షల రూపాయలు బ్రహ్మానందంకు దక్కాయా.. ? అంతేకాదు ప్రేమించిన ప్రియురాలు చివరకు బ్రహ్మానందం సొంతం అయిందా.. ? అసలు బ్రహ్మానందం.. తన తాతైన ఆనంద్ రామ్మూర్తికి ఎందుకు దూరంగా ఉంటున్నాడనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం.. రాజా గౌతమ్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా కాకుండా.. తాత మనవళ్లుగా నటించడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా లో ఏదో కారణంతో దూరంగా ఉంటున్న తాత మనవళ్లు చిన్న ఎమోషన్ తో  దగ్గర కావడం వంటి అంశాలు ఈ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. మొత్తంగా నటుడు కావాలన్న కోరిక కోసం తాత ఊరికి వెళ్లడం.. అక్కడ తాత ఆనంద్ రామ్మూర్తి ట్విస్ట్ తో అక్కడ ఇరుక్కుపోవడం అంశాల ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. మొత్తంగా మరిచిపోతున్న మానవ సంబంధాలను ఈ సినిమాలో సున్నితంగా సృశించడం వంటి ఆకట్టుకుంటాయి. మొత్తంగా తాను తాతను దూరంగా పెట్టినా.. తాత మాత్రం మనవడి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసాడనేది ఈ సినిమాలో ఆసక్తి రేకెత్తించాయి. ముఖ్యంగా హీరో పాత్రను స్వార్ధపూరితంగా చూపించడం.. ఆ తర్వాత డబ్బు కంటే మానవ సంబంధాలే ఇంపార్టెంట్ అని చూపించడం వంటివి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు.  మొత్తంగా కామెడీతో పాటు భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. నిర్మాణ విలువులు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం బ్రహ్మాకి అలవాటు. ఈ సినిమాలో ఆనంద్ రామ్మూర్తి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆయన కుమారుడు రాజా గౌతమ్ తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో తనదైన మార్క్ నటనతో నవ్వించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ క్యారెక్టర్స్ లో మెప్పించారు.

పంచ్ లైన్: ఆకట్టుకునే భావోద్వేగాల ‘బ్రహ్మా ఆనందం’..  

రేటింగ్:3/5

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News