Manchu Mohan Babu: మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొనసాగుతూనే ఉంది. కుటుంబంలో నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. ఈ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను వృద్ధుడిని అని.. మంచు మనోజ్ అక్రమంగా నివసిస్తున్నాడని.. అతడిని ఖాళీ చేయించాలని మంచు మోహన్ బాబు జిల్లా అధికారులను కలిశారు. కలెక్టర్‌ను కలిసి తన బాధలను చెప్పుకుని మనోజ్ నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంతో వారి కుటుంబ వివాదం మరింత ముదిరింది.
Also Read: Laila Teaser: 'తెల్లగా సేసుడే కాదు.. తోలు తీసుడు వచ్చు'.. మాస్ కా దాస్ 'లైలా' టీజర్ విడుదల
హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉన్న భవనంలో మంచు మనోజ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ ఇంటిపై తీవ్ర వివాదం కొనసాగుతోంది. అయితే ఆ ఇల్లు తనదని.. ఆ ఇంటిని మనోజ్ ఖాళీ చేయాలని కొన్నాళ్లుగా మోహన్ బాబు కోరుతున్నారు. తాజాగా ఇదే విషయమై చట్టపరంగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చట్టంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని మంచు మనోజ్ ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి తనకు అప్పగించాలని కోరడం సంచలనం రేపింది.
Also Read: Sreemukhi: మరో వివాదంలో శ్రీముఖి.. ఇంద్రకీలాద్రిపై రీల్స్, ఫొటోషూట్‌తో హల్చల్
తన ఆస్తులలో ఉన్న అందర్నీ ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు శనివారం ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని పరోక్షంగా తన కుమారుడు మనోజ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆస్తులలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరాడు. కుటుంబ వివాదం నుంచి కొన్ని రోజులుగా తాను తిరుపతిలో ఉంటున్నట్లు వివరించాడు.
సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు మెజిస్ట్రేట్‌ను కోరారు. మోహన్ బాబు ఫిర్యాదును పరిశీలించిన అనంతరం కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక అడిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా జల్పల్లి భవనంలో నివసిస్తున్న మంచు మనోజ్‌కి కలెక్టర్ నోటీసు ఇచ్చారు. ఈ పరిణామంతో వారి కుటుంబం మధ్య వివాదం మరింత ముదిరింది. మరి కలెక్టర్ ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter