Pushpa 2 Update: 2021 లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అన్నీ భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు అందుకున్న ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 మీద కూడా.. అంతకుమించి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల.. సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించారు.
కానీ విడుదలకి ముందే సినిమాకి 50 కోట్ల నష్టం వచ్చింది. దానికి కారణం సినిమా వాయిదా పడటం.. అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ వాయిదా పడటం కారణంగా.. మైత్రి మూవీ మేకర్స్ కు 35 కోట్లు నష్టం వచ్చిందట. ఇందులోనే ప్రొడక్షన్ షెడ్యూల్స్ ఎక్స్టెండ్ అయినదానికి, మార్కెటింగ్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ అవకాశం కూడా సినిమా మిస్ చేసుకుంది.
అసలైతే పుష్ప 2 సినిమా అదిరిపోయే ఓపెనింగ్ డే కలెక్షన్లు అందుకోవాలి. ముఖ్యంగా నార్త్ లో కూడా ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ మొదటి రోజు అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప సినిమా హిందీలో కూడా పెద్ద హిట్ అయింది. పుష్ప 2 మీద కూడా అక్కడ అదే రేంజ్ హైప్ ఉంది. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడింది. ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్ డే.. కలెక్షన్ల మీద కూడా భారీగా పడనుంది.
ఉదాహరణకి కేవలం జనవరిలో విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చిలో విడుదలైనందుకే ఓపెనింగ్ డే కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది. ఇక పుష్ప సినిమా ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడింది. ఇప్పటికైనా సినిమా డిసెంబర్లో విడుదల అవుతుందో లేదో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో సినిమా మీద ఉన్న క్రేజ్ భారీగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా సినిమాకి భారీ నష్టం ఏర్పడింది. మరోవైపు భారీ కాంపిటేషన్ మధ్య విడుదలవుతున్న పుష్ప సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్సుఖ్నగర్ దిగ్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook