Electric Truck: త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రక్కులు.. ఇక డీజిల్ ట్రక్కులకు గుడ్ బై..

Tresa Motors Electric Trucks: భారత దేశంలో త్వరలోనే ఎలక్ట్రిక్ ట్రక్కులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. ప్రముఖ మోటార్స్ కంపెనీ ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్కుల విడుదలకు రంగం సిద్ధం చేసింది. వీలైనంత తొందరగా భారత మార్కెట్లోకి ఈ ట్రక్కులను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ట్రక్కులకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 4, 2023, 12:05 PM IST
Electric Truck: త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రక్కులు.. ఇక డీజిల్ ట్రక్కులకు గుడ్ బై..

Tresa Motors Electric Trucks: ప్రముఖ ట్రెసా మోటార్స్ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ ట్రక్కును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ట్రక్కును ఫ్లాగ్‌షిప్ యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్‌ఫారమ్ ఫ్లక్స్ 350పై రూపొందించినట్లు కంపెనీ వివరించింది. త్వరలోనే ఈ కంపెనీ ప్రపంచంలోని అన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. ట్రెసా మోటార్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మినీ ట్రక్కుల నుంచి వారి ట్రక్కుల దాకా సురక్షితమైన బ్యాటరీతో తయారు చేయబోతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ కంపెనీకి సంబంధించిన 2.8 మిలియన్ల ట్రక్కులను విక్రయించబోతునట్లు తెలిపింది. ఈ ట్రక్కులు మార్కెట్లో ఇంతకుముందున్న వాటికంటే భిన్నమైన శైలిలో అధునాతన ఫీచర్స్ తో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ట్రక్కులకు సంబంధించిన ఫీచర్స్ ఏంటో మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

పెరుగుతున్న ఇంధనం ధరలను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ 2024లో ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొదటి దఫా 1.8 మిలియన్ ట్రక్కులను కస్టమర్లకు అందించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంతకుముందు ఈ కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన డీజిల్ ట్రక్కులకు భారీ మొత్తంలో డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. యాజమాన్యం దీనిని దృష్టిలో పెట్టుకుని డీజిల్ ఖర్చులను తగ్గించేందుకు అతి తక్కువ ధరలకు ట్రెసా మోటార్స్ భారత దేశంలో 2.8 మిలియన్ ట్రక్కులను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. 

ఫ్లక్స్ మోటార్ టెక్నాలజీపై రూపొందించే ట్రెసా ట్రక్కులను ఫ్లక్స్ 350 అనే నామకరణంతో మార్కెట్లోకి తీసుకురాబోతున్న ట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు 350 kW సామర్థ్యంతో రోడ్లపై పరుగులు పెట్టబోతున్నా యి. ఇలాంటి ఫీచర్ కలిగిన ట్రక్కుల్లో భారతదేశంలో ఈ ట్రక్కు మొదటగా నిలవబోతోంది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్‌లను తయారు చేసే ప్రపంచంలోని అతి కొద్ది కంపెనీలలో ఇది ఒకటి. గ్లోబల్ ఇన్నోవేషన్‌లో ట్రెసా మోటార్స్ ప్రముఖ స్థానాన్ని సాధించింది.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x