Jagan 2.0: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విజయవాడ కార్పొరేషన్ వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూస్తారని వైఎస్ జగన్ తెలిపారు. అక్రమ కేసులు పెట్టినవారిని వదలేది లేదని హెచ్చరించారు.
విజయవాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఇతర నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కాస్త భిన్నంగా కన్పించారు. కసి, పట్టుదల ఆయన మాటల్లో స్పష్టంగా కన్పించాయి. ఈసారి జగన్ 2.0ని చూస్తారని చెప్పిన జగన్..ఈసారి వేరే లెవెల్ ఉంటుందని సినిమా స్టైల్‌లో చెప్పారు. చంద్రబాబు పెడుతున్న కష్టాల్ని కళ్లారా చూస్తున్నానని, ఎక్కడ ఉన్నా చట్టం ముందు తీసుకొచ్చి నిలబెట్టి శిక్షిస్తానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరించడం, దొంగ కేసులు పెట్టడం చేస్తారని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు. కచ్చితంగా మళ్లీ అధికారంలో వస్తామని...ఈసారి 30 ఏళ్లు పరిపాలన చేస్తామని చెప్పారు.
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని, త్వరలోనే జమిలి ఎన్నికలు జరిగితే అఖండ మెజార్టీతో వైసీపీ విజయం ఖాయమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని, వాటిని ఎదుర్కుంటేనే నాయకుడిగా ఎదుగుతామన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. తనను తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కలిసి 16 నెలలు జైళ్లో పెట్టిన సంగతిని గుర్తు చేశారు. అయినా సరే ఎదుర్కొని ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యానన్నారు.
విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 49 స్థానాలు గెలిచామని భయంతో, ప్రలోభాలతో 13 మందిని తీసుకున్నారని చెప్పారు. అయినా ఇప్పటికీ 38 పార్టీ వెంటే నిలబడి ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. మొత్తానికి జగన్ చేసిన ప్రసంగం అంతా కార్యకర్తలకు అండగా ఉన్నాననే సంకేతాన్ని స్పష్టం చేసింది. నిజంగానే జగన్ 2.0 చూశామంటున్నారు వైసీపీ నేతలు.
Also read: 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి