Nara Lokesh: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార కూటమిలోని పార్టీల నాయకులు కూడా పోలీసులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. పోలీసులపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ వారిపై ఒత్తిడి చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆయన 'సీజ్ ద షిప్' లాగా హల్‌చల్ చేస్తున్నారు. నారా లోకేశ్ ఒక అడుగు ముందుకు సందర్భం దొరికిన ప్రతిసారి పోలీస్ అధికారులకు క్లాస్ పీకుతున్నారు. తాజాగా తన పార్టీ కార్యాలయం వద్ద లోకేశ్ పోలీసుల అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలిట్‌బ్యూరో సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున నాయకులు వస్తుండడంతో టీడీపీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. వంద, 200కు పైగా పోలీసు సిబ్బంది మొహరించారు. కార్యాలయంలోకి వెళ్లే వారిని పకడ్బందీగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయితే తనిఖీలతో టీడీపీ కార్యర్తలు, నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం నారా లోకేశ్ దృష్టికి రావడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Vijaysai Reddy: వైసీపీకి రాజీనామా చేస్తూనే విజయ సాయిరెడ్డి సంచలన కోరిక.. 'జగన్ మళ్లీ సీఎం కావాలి'
భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఉన్నత అధికారులను పిలిపించి నారా లోకేశ్ మాట్లాడారు. పార్టీ సామావేశానికి ఇంత మంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించినట్లు సమాచారం. 'ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా' అంటూ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే టీడీపీ నాయకులను బందోబస్తు పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. నామమాత్రపు బందోబస్తు కల్పిస్తే చాలు అని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మరోసారి పోలీసులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీశ్ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఏ సందర్భమైనా పోలీస్ శాఖను తప్పుబడుతుండడంతో పోలీస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే రాజకీయాల కోసం తమను ఇబ్బంది పెట్టడం సరికాదని కొందరు పోలీస్ అధికారులు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.