Manchu manoj shocking mohan babu and Vishnu: మంచు మోహన్ బాబు ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సీటీలో ప్రశాంతంగా విద్యార్థులతో కలిసి సంక్రాంతి వేడుకల్ని జరుపుకున్నారు. అంతే కాకుండా.. కొన్ని వివాదాస్పద అంశాల గురించి.. అయిపోయిందేదో అయిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు మోహన్ బాబుకి రిపొర్టపై దాడికేసులో.. బెయిల్ ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా మంచు మోహన్ బాబు వివాదం చల్లబడిందని అందరు అనుకున్నారు.
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్
మూడో గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి వెళ్లిన మంచు మనోజ్
మనోజ్‌ను అడ్డుకున్న బౌన్సర్లు.. గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన మంచు మనోజ్ సిబ్బంది
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు https://t.co/tRzEzVCM1I pic.twitter.com/gfnWp2O2J8
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025
ఈ క్రమంలో మంచు మనోజ్ మళ్లీ తిరుపతికి వెళ్లారు. అక్కడ తన బంధువుల్ని కలిసి.. మోహన్ బాబు యూనీవర్సీటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు మంచు మనోజ్ బీఎంయూలోకి రావొద్దని కూడా నోటీసులు ఇచ్చారు.
అదే విధంగా మనోజ్ యూనీవర్సీటీలోకి వెళ్లకూడదని కోర్టు వారి ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ మనోజ్ మాత్రం.. ఇవన్ని పట్టించుకొకుండా.. మోహన్ బాబు యూనివర్సీటీలోకి వెళ్లి తన నానమ్మ, తాతల సమాధికి దండం పెట్టుకుంటానని యూనీవర్సీటీ ముందు హల్ చల్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ వస్తున్నాడని సమాచారంలో ముందు జాగ్రత్తగా పోలీసులు బీఎంయూ యూనీ వర్సీటీ దగ్గర భారీ ఎత్తున చేరుకున్నారు.
మోహన్ బాబు యూనీవర్సీటీ దగ్గరతోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అంతే కాకుండా.. కొంతమంది బౌన్సర్ లు కొత్తగా జల్ పల్లి లోకి వస్తున్నారని... వాళ్లకు తాను వాళ్లకు.. ఒక్కడ్ని చాలని కూడా మాట్లాడారు. తనను ఎందుకు లోనికి రానివ్వడంలేదని మండిపడ్డారు. తన ఫ్లెక్సీలను సైతం చింపేశారన్నారు. కానీ తనమీద ఉన్న అభిమానాన్ని మాత్రం ఎవరు చెరిపేయలేరన్నారు.
Read more: Tirumala: ఇదెక్కడి ఘోరం గోవిందా..?.. తిరుమలలో బైటపడ్డ మరో షాకింగ్ ఘటన.. ఏం జరిగిందంటే..?
ఈరోజు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కూర్చుని మాట్లాడి గొడవలను పరిష్కరించుకునేందుకు తాను సిద్దమేనంటూ మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబుకు మెస్సెజ్ ఇచ్చారు. తనను చూసి భయపడుతున్నారో.. మరేంటో కానీ.. ఎవరు మాట్లాడటంలేదన్నారు. దీంతో మంచు ఇంట మంటలు మరోసారి రచ్చగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter