/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Academy Will Take Action Against Will Smith: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు విల్ స్మిత్ ప్రవర్తించిన తీరుపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన భార్యను కామెంట్ చేశాడన్న కోపంతో వ్యాఖ్యాత క్రిస్ రాక్‌ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో విల్ స్మిత్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ .. సిద్ధమవుతోంది. ఈ ఘటన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశమైంది. సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ... స్మిత్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ఒక వ్యక్తిపై భౌతిక దాడి చేయడం, బెదిరించేలా ప్రవర్తించడం తదితర చర్యలను అకాడమీ తీవ్రంగా పరిగణిస్తోంది. స్మిత్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు మొదలుపెట్టారు. స్మిత్‌పై సస్పెన్షన్  వేటు వేయాలా ?  బహిష్కరించాలా ? లేదా ఇతర చర్యలు తీసుకోవాలా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 18న బోర్డు మరోసారి సమావేశం కానుంది. 

అయితే ఉత్తమ నటుడిగా స్మిత్ కు అందజేసిన ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఘటన తర్వాత ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ నుంచి వెళ్లిపోవాలని కోరినా.. స్మిత్ నిరాకరించాడు. దీన్ని కూడా అకాడమీ తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో తన ప్రవర్తన పై స్మిత్ 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.   ఈ సందర్భంగా కమెడియన్, వ్యాఖ్యాత క్రిస్ రాక్‌ కు అకాడమీ క్షమాపణలు తెలిపింది. నామినీలు, అతిథులు, ప్రేక్షకులను కూడా క్షమాపణలు కోరింది.
అప్పుడు జరిగిందేంటంటే..

94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ పై వ్యాఖ్యాత క్రిస్ రాక్ ఓ కామెంట్ చేశారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా ఆమె పూర్తిగా గుండుతో కనిపించింది. దాంతో జీ.ఐ.జేన్ చిత్రంలో డెమిమూర్ పాత్రతో ఆమెను క్రిస్ రాక్ పోల్చాడు. ఆ పాత్రలో డెమి మూర్ కూడా గుండుతో ఉండటంతో అలా చేశాడు. అయితే అతడి వ్యాఖ్యలను స్మిత్ తొలుత నవ్వుతూ తీసుకున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ ను చంపదెబ్బ కొట్టాడు. తర్వాత కొద్ది సేపటికి ఉత్తమ నటుడిగా అస్కార్ అందుకున్నాడు. అయితే వేదికపైనే స్పందించిన స్మిత్ అకాడమీతో పాటు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. తర్వాత రోజు ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా క్రిస్ రాక్ ను బహిరంగ క్షమాపణలు కోరాడు. తన భార్య పై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేక అలా చేశానని తెలిపాడు.

Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!

Also Read: Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్‌ ఫైర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
Academy Will Take Action Against Will Smith For Slapping Chris Rock at Oscars
News Source: 
Home Title: 

Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?

Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?
Caption: 
Academy Will Take Action Against Will Smith (Photo: Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

విల్ స్మిత్ ప్రవర్తించిన తీరుపై  సర్వత్రా విమర్శలు 

భార్యను కామెంట్ చేశాడని వ్యాఖ్యాత క్రిస్ రాక్‌ కొట్టిన స్మిత్ 

స్మిత్‌పై సస్పెన్షన్  వేటు వేయాలా, బహిష్కరించాలా..? అన్న దానిపై చర్చలు 

Mobile Title: 
Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, March 31, 2022 - 17:12
Request Count: 
68
Is Breaking News: 
No