Vaikunta Dwara Darshan In Vemulawada: హరి హర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ అర్చకులు విశిష్ట పూజలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మస్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామివార్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రముఖులు దర్శించుకున్నారు..
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అప్పల బీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించి.. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులుగా ప్రతిష్టించారు. మూర్తులను దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు వచ్చారు. దీంతో వేలాది మంది భక్తులు ఓం నమశ్శివాయ.. ఓం నమో నారాయణాయ అంటూ నామస్మరణ చేస్తూ స్వామివార్లను దర్శించుకున్నారు.
వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేకువజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ పెద్ద సేవలో పాల్గొని తరించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ విశిష్టత ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారని.. ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన సమయంలో వచ్చిన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి చేరుకోవడం జరుగుతుందని అన్నారు.. భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఈ రోజు కొలవడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని తెలిపారు.. ఈ పర్వదినం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్‌ను ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ఆలయ ఏవో వినోద్ రెడ్డితో కలసి ప్రారంభించారు. నిత్యం వేళ సంఖ్యలో భక్తులు రాజన్నను దర్శించుకుంటారని వారి సౌకర్యర్థం, ఫ్యాన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు రాజన్న స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter