PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?

PM Modi Telangana tour: ప్రధాని మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూలై 12న రాష్ట్రానికి మోదీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2023, 10:06 AM IST
PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?

PM Modi Telangana tour Updates: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. జూలై 12న ప్రధాని రాష్ట్రానికి వస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ -పీఓహెచ్‌ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. బీజేపీ 'మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌'లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూలై 12న మోదీ వస్తారని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. అదే రోజు వరంగల్ లో సభ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని.. రెండు రోజుల్లో ప్రధాని టూర్ ఖరారు అవుతుందని నేతలు తెలిపారు. 

జూలై 08న కీలక నేతల సమావేశం
ఇదిలా ఉంటే, జూలై 08న హైదరాబాద్ వేదిగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ సమావేశం పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని కమలదళం భావిస్తోంది. అందుకే వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులతో కీలక భేటీకి భాగ్యనగరాన్ని వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ వివిధ రాష్ట్రాల నంచి 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు తెలంగాణకు రానున్నారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన 'మేరా పోలింగ్‌ బూత్‌... సబ్‌సే మజ్బూత్‌' కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు ప్రత్యేక రైలులో తెలంగాణకు చేరుకుంటారు. సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాలల్లో మూడు బృందాలుగా విడిపోతారు. వీరంతా జూలై 05 వరకు రాష్ట్రంలోనే ఉండి.. పార్టీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతారు. భోపాల్‌లో జరిగిన ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి బీజేపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News