Krithika Infra Developers pre launch scam: హైదరబాద్ లో మధ్య తరగతి ప్రజలు ఇల్లు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తమకంటూ ఒక సొంత జాగా ఉండాలని ఎన్నో కలలు కంటారు. దీని కోసం పగలనక, రాత్రనక కష్టపడుతుంటారు. కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరు జాబ్ లు చేసి, కొంచెం సొమ్ము పక్కన పెట్టి జాగ్రత్తగా ఇల్లు కొనేందుకు మరికొంత డబ్బులు దాచిపెట్టుకుంటారు.
అయితే.. ఇటీవల హైదరాబాద్ లో కొంత మంది మధ్య తరగతి ప్రజల్ని బలహీనతలే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. ప్రీలాంచ్ పేరిట భారీ మోసాలకు తెరలేపుతున్నారు. ప్లాట్ లు తక్కువ ధరకే వస్తాయని ప్రజలు ఇలాంటి వాటిపై ఇన్ వెస్ట్ చేస్తున్నారు. రెండు, మూడు ఏళ్లలో అపార్ట్ మెంట్ లు నిర్మిస్తామని చెప్పి..ప్రజల నుంచి కోట్లలో వసూలు చేస్తున్నారు. వీరి మాయ మటల్లో పడిన అమాయకులు మాత్రం డబ్బులు చెల్లించి అడ్డంగామోసపోతున్నారు. అయితే.. ఇటీవల హైదరబాద్ లో ప్రీలాంచ్ మోసాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.
సువర్ణ భూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్.. ఇప్పుడు క్రీతీక ఇన్ ఫ్రా డెవలపర్ మోసం.. ఈ క్రితీక డెవలపర్స్ వాళ్లు.. 2020 లో ప్రీలాంచ్ సెల్ ను ఏర్పాటు చేశారంట. వీరి మాటలు నమ్మి.. జనాలు భారీగా డబ్బులు దీనిలో ఇన్ వెస్ట్ చేశారంట. దీంతో ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టక పొవడంతో దీనిపై బాధితులు నిలదీయగా.. బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీంతో బాధితులు.. తాజాగా.. పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తొంది.
ముఖ్యంగా బాధితులు.. ఎల్ బీ నగర్, ఉప్పల్ లలో మరికొన్ని చోట్ల క్రితీక ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ గ్రూప్ లలో ఇన్ వెస్ట్ మెంట్ చేసినట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో బాధితులు.. ధూమవత్ గోపాల్, శ్రీకాంత్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కూడా బాధితులు కోరినట్లు సమాచారం. ఈ ఘటనలో మధ్య తరగటతి ప్రజలు మాత్రం ప్రీలాంచ్ అంటేనే భయపడిపోతున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.