BJP vs BRS Flexi War: నిజామాబాద్ జిల్లాలో బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీల మధ్య ప్లెక్సీ వార్ మొదలైంది. శుక్రవారం జిల్లాలో "ఇదిగో మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు" అంటూ పరోక్షంగా స్థానిక ఎంపీ, బీజేపి నేత ధర్మపురి అరవింద్‌ని విమర్శిస్తూ పసుపు బోర్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇదిలావుండగానే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను పరోక్షంగా వేలెత్తి చూపిస్తూ శనివారం బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. వరుసగా బీజేపి vs బీఆర్ఎస్ అన్నట్టుగా వెలిసిన ఫ్లెక్సీల పంచాయతీతో నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ వార్ షురూ అయింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ళలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 500 కోట్లతో ఎన్నారై సెల్ ఏర్పాటు, నిరుద్యోగ భృతి లాంటి ప్రభుత్వ పథకాలను ప్రశ్నిస్తూ వినూత్న రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలలో కొన్నింటిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చించి వేశారు.
ఇదిగో నిరుద్యోగ భృతి అని, సీఎం కేసీఆర్ మాట ఇస్తే తలనరుక్కుంటాడు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు గులాబీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగరంలో హాట్ టాపిక్ అయింది. సుభాష్ నగర్‌లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త క్యాంపు కార్యాలయం వద్ద సైతం ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. నిరుద్యోగులకు నెలకు 3,016/- నిరుద్యోగ భృతి ఇదిగో అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
బీజేపి, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేస్తూ వెలిసిన ఫ్లెక్సీలతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ రణరంగం మొదలైంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జిల్లాలో చర్చ నియాంశంగా మారింది. బిఆర్ఎస్, బిజెపిలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటూ ఏర్పాటు చేస్తోన్న ఫ్లెక్సీల కల్చర్ చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనే ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి : Minister Harish Rao: కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి.. తెలంగాణపై కేంద్రం దోపిడి: మంత్రి హరీష్ రావు ఫైర్
ఇది కూడా చదవండి : Etala Rajender Slams KCR: కేసీఆర్, కేటీఆర్‌లకు చురకలంటించిన ఈటల
ఇది కూడా చదవండి : Revanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK