Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila AP Entry: తెలంగాణ రాజకీయాలను వదిలేసి సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తొలిరోజే అవమానం ఎదురైంది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయవాడలో అడుగుపెట్టగా పోలీసులు అడ్డగించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి షర్మిల వాహనాల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దా? అని ప్రశ్నించారు. పోలీసుల అడ్డగింతపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్లో ఆయన ప్రసంగం చేశారు.
Fan Who Tripled On Six Guarantee: జగిత్యాల జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వినూత్నంగా ముగ్గు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అభిమానాన్ని చాటుకుంటూ ముగ్గుతో ఆరు గ్యారెంటీ పథకాలతో వివరించింది.
Sajjala Comments: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి సమీకరణాలు మరింతగా మారేట్టు కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Election Result 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ట్కు తగ్గట్టే ఉన్నా ఊహించని అనూహ్య పరిణామాలు మాత్రం చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే, ఊహించని ఫలితాలు కూడా షాక్ ఇచ్చాయి.
BRS-BJP Alliance: తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడ్డాయి. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రచారం హోరెత్తుతోంది. హంగ్ ఏర్పడుతుందనే వార్తల నేపధ్యంలో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. వివిధ సంస్థల సర్వేలు ఇప్పటికే రాజకీయంగా వేడి పుట్టిస్తుంటే..మిషన్ చాణక్య సర్వే ఆసక్తి కల్గిస్తోంది. మిషన్ చాణక్య సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి...
Election Survey 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ తీవ్రమైంది. ఈ నేపధ్యంలో తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదనే విషయంలో మరో సర్వే వెల్లడైంది.
Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
Congress First List: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా వామపక్షాలకు 4 సీట్లు కేటాయిస్తోంది పార్టీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Times Now ETG Survey: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరోసారి సర్వే నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు సర్వేలో వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kumbham Anil Kumar Reddy joins Congress party: కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం అనేది అత్యంత సహజం అని lతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లాల్సి రావడంపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Six Schemes: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త 6 పథకాల్ని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.