Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?

Reasons Behind IND VS BAN Match Defeat: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఎవరు కారణం ? ఎలాంటి లోపాల కారణంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోయింది అనే అంశాలను ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.

Written by - Pavan | Last Updated : Sep 16, 2023, 04:20 PM IST
Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?

Reasons Behind IND VS BAN Match Defeat: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కి బెర్త్ ఖరారైనప్పటికీ.. టోర్నీలో ముందు నుండి దూకుడు ప్రదర్శిస్తూ పాయింట్స్ పట్టికలో ముందున్న భారత్ గెలుస్తుందుకున్న మ్యాచ్‌లో ఓటమి చెందడం టీమిండియా ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. దీంతో టీమిండియా జట్టు కూడా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనందుకు లోలోపలే రివ్యూలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఓటమికి ఎవరు కారణం ? ఎలాంటి లోపాల కారణంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోయింది అనే అంశాలను ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.

భారత జట్టు ఓటమికి సత్తా కలిగిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడకపోవడమే అని చెబుతున్న నెటిజెన్స్.. వారు తమ ప్రతిభను సరిగ్గా ప్రదర్శించకపోవడం వల్లే జట్టు ఓటమిపాలైంది అని తీర్పునిస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లే ఈ ఓటమికి బాధ్యలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరంటే..

ఈషాన్ కిషన్ ఫ్లాప్ షో :
పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయిన ఈషాన్ కిషన్.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో 15 బంతులు ఆడిన ఈషాన్ కిషన్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు.

పారని జడేజా మంత్రం : 
తాను ఆడిన పలు మ్యాచ్ ల్లో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్ లో ఆకట్టుకునే ఆటతీరును కనబర్చలేకపోయాడు. బౌలింగ్ లోనూ ఈసారి జడేజా ఫెయిల్ అయ్యాడు. వేసిన 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే తీసిన జడేజా.. 53 పరుగులు సమర్పించుకున్నాడు. శార్థూల్ థాకూర్ 65 పరుగులు సమర్పించుకున్నప్పటికీ అతడు 3 వికెట్లు తీయగలిగాడు.   
 
ఫట్‌మన్న రోహిత్ శర్మ : 
ఎన్నో మ్యాచుల్లో చెలరేగిపోయి జట్టును గెలిపించిన హిట్ మ్యాన్ కేప్టేన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పై మాత్రం ఫట్‌మన్నాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ.. షకీబ్ బౌలింగ్ లో 2 బంతులకే ఒక్క పరుగు కూడా తీయకుండానే అనముల్ హఖ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

విఫలమైన తిలక్ వర్మ : 
ఆసియా కప్ 2023 తో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ.. ఈ మ్యాచ్ లో 9 బంతులు ఆడి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లోనూ 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వర్మ ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. 

ఇది కూడా చదవండి : IND VS BAN Match Highlights: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 6 పరుగుల తేడాతో విజయం

నిరాశపరిచిన సూర్య కుమార్ యాదవ్ : 
సూర్య కుమార్ యాదవ్ సైతం ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. 34 బంతులు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 3 ఫోర్లతో కలిపి మొత్తం 26 పరుగులు మాత్రమే చేశాడు. చాలాసేపు క్రీజులో నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ.. ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టలేకపోయాడు.

ఇది కూడా చదవండి : ఫైనల్ కు చేరిన శ్రీలంక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x