Elephant attack video viral in kerala: సాధారణంగా ఏనుగుల్ని పెద్ద ఉత్సవాలకు తీసుకొని వెళ్తుంటారు. అక్కడ ఏనుగుల మీద దేవత విగ్రహాలను ఊరేగిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో ఏనుగులు ఉత్సవాలకు తీసుకెళ్లినప్పుడు అక్కడ డీజే చప్పుళ్లు, టపాకాయలకు బెదిరిపోతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఏనుగులు దాడులు చేసిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి.
Tragedy strikes. #DisturbingVisuals.
17 members injured in Elephant attack!
At the Thirrur Puthiyangadi Utsavam in Mallapuram, Kerala, an elephant attacked people in anger.
17 members were injured while the situation of one is critical.#Kerala #KeralaElephant… pic.twitter.com/ElCe8fopyn
— TeluguScribeNow (@TeluguScribeNow) January 8, 2025
కొంత మంది ఆకతాయిలు కూడా ఉత్సవాలలో ఉన్న ఏనుగుల్ని ఏదో రకంగా వాటిని కోపం తెప్పించే విధంగా ఫోటోలు తీయడం, రాళ్లు, కర్రలతో కొట్టడం చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఏనుగులు రెచ్చిపోయి దాడులు చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఏనుగులు దాడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
కేరళలోని మలప్పురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరుర్‌లో జరిగిన పుతియంగడి ఉత్సవానికి వందలాది మంది తరలివచ్చారు. అక్కడ అనేక ఏనుగుల మీద దేవతల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అయితే.. ఒక వ్యక్తి ఏనుగుల్ని దగ్గర నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిటన్లు తెలుస్తొంది. దీంతో ఆ ఏనుగు కళ్ల మీద లైట్ పడటంతో కోపంతో రెచ్చిపోయింది.
Read more: Wedding Video: అయ్ పాయ్.. పెళ్లిలో వరుడి పరువు గోవిందా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..
అంతే కాకుండా.. అక్కడున్న వ్యక్తిని తుండంతో ఎత్తి మరోవైపు పడేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దాదాపు.. 17 మంది తీవ్రంగాగాయడిపట్లు తెలుస్తొంది. వెంటనే మావటి వాళ్లు రెండు గంటపాటు కష్టపడి ఏనుగులను శాంతింప చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter