Miss World 2025: ప్రపంచ దేశాల సుందరాంగులు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన హైదరాబాద్ లో జరగనున్నాయి.ప్రపంచంలోని అందగత్తెలు అందరూ ఓ చోట చేరడం.. అందులో ఒకరు విన్నర్ అవ్వడం. ఈ వేడుకని చూసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమవ్వడం.. ఇలా ఉంటుంది ప్రతి యేడాది పరిస్థితి. అందాల పోటీల్లో ఏ దేశపు అందగత్తె కిరీటాన్ని అందుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంపిటీషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇయర్ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి.
2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 28 ఏళ్ళ తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది భారత్. ఈ పోటీలో జెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్ గా గెలుపొందింది. 1996లో మొదటిసారి భారత దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగగా ఈ పోటీల్లో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు మన దేశం వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
వార్షిక మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యత కలిగిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌లుగా మార్చింది. ఈ సంస్థ వికలాంగులు .. వెనుకబడిన పిల్లలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించింది. 100 కంటే ఎక్కువ దేశాలలో ఫ్రాంచైజీలతో, మిస్ వరల్డ్ అందాన్ని మించిన ప్రపంచ వేదికగా మారుతుంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.