Election Code Case: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత గుంటూరు పర్యటనపై చర్చనీయాంశమైంది. గుంటూరు మిర్చియార్డును సందర్శించిన వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కోడ్ ఉల్లంఘన ఇతర కేసులు నమోదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారీగా జనం పోటెత్తారు. అయితే కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం కావడంతో జగన్ పర్యటనను పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. దాంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా జగన్ పర్యటించడం కోడ్ ఉల్లంఘన అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వైఎస్ జగన్‌తోపాటు పార్టీ నేతలు , మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడులపై కేసు నమోదైంది.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గుంటూరులో పర్యటించడాన్ని కోడ్ ఉల్లంఘనగా కేసులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో పాటు పోలీసుల నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సీహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వైఎస్ జగన్ గుంపుతో కలిసి మిర్చి యార్డులో ప్రవేశించారని ఫిర్యాదులో ఉంది. దాంతో రైతులకు తీవ్ర అసౌకర్యం, ఆటంకం కలిగినట్టు గుర్తించామని ఫిర్యాదులో ఉంది. మిర్చియార్డు బయట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతల అనుచరులు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి, వాహనదారులు ఇబ్బంది పడ్డారని వివరించారు. అనుమతి లేకుండా , అనుచరులతో వచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది.
గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేయనున్నారు.
Also read: Cheap and Best Cars: అన్ని ఫీచర్లతో 7 లక్షల బడ్జెట్ టాప్ 5 కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి