Slipper Thrown On Judge: ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడిపై న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నేరానికి పాల్పడ్డ అతడికి జడ్జి శిక్ష విధించగా.. తీర్పు వెలువడిన వెంటనే ఆ నిందితుడు న్యాయమూర్తిపై దాడికి పాల్పడ్డాడు. న్యాయస్థానం ఆవరణలోనే జడ్జిపై చెప్పు విసిరాడు. ఈ అనూహ్య ఘటనతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉలిక్కిపడ్డారు. వెంటనే న్యాయవాదులు అతడిపై దాడికి పాల్పడి వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగిన ఈ సంఘటన న్యాయవర్గాల్లో సంచలనం రేపింది.
Also Read: Rishabh Pant: లవర్స్ డే ముందు పంత్‌కు భారీ షాక్.. ప్రాణాలు కాపాడిన వ్యక్తి లవర్‌తో ఆత్మహత్యాయత్నం
జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మ్స్ ఆక్ట్ కేసులో ఖరమ్సింగ్కు శిక్ష పడింది. విచారణ కోసం గురువారం కోర్టు హాల్లోకి ఖరమ్ సింగ్‌ను పోలీసులు, జైలు అధికారులు తీసుకువచ్చారు. అయితే తనపై శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు న్యాయమూర్తిపై ఖరమ్ సింగ్ ఆగ్రహంతో ఉన్నాడు. తనకు శిక్ష విధించడాన్ని సహించలేకపోయాడు. తనపై నమోదైన కేసులో శిక్ష పడదని భావించిన అతడు న్యాయమూర్తి తీర్పుతో ఖంగుతిన్నాడు. దీంతో జడ్జిపై ఆగ్రహంతో ఉన్న అతడు గురువారం దాడికి పాల్పడ్డాడు. న్యాయమూర్తిపై చెప్పును విసిరాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన న్యాయవాదులు ఖరమ్ సింగ్‌కు దేహ శుద్ధి చేశారు.
Also Read: Meat In Temple: ఆలయంలో మాంసం ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకువచ్చి న్యాయవాదులు అతడిని చితకబాదారు. న్యాయవాదుల దాడి నుంచి ఖరమ్ సింగ్‌ను రక్షించిన జైలు అధికారులు అతడిని అక్కడి నుంచి తరలించారు. ఈ దాడితో న్యాయవాదులు, న్యాయమూర్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వార్త న్యాయశాఖలో కలకలం రేపింది. నిందితుడు జడ్జిపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. దాడికి పాల్పడిన ఖరమ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.