Lions attacks on elephants video viral: సాధారణంగా అడవిలో అనేక రకాల క్రూర జంతువులు, సాధు జంతువులు ఉంటాయి. ముఖ్యంగా క్రూర జంతువులు తరచుగా సాధు జంతువులపై దాడులు చేస్తుంటాయి. సింహాలు, పులులు, చిరుతలు తరచుగా.. జింకలు, విల్డర్ బీస్ట్, ఏనుగులు, గేదెలపై దాడులు చేస్తుంటాయి. కొన్నిసార్లు అడవి జంతువులు దాడులు చేసినప్పుడు సాధు జంతువులు పారిపోతుంటాయి.
ఈ క్రమంలో అడవిలో చాలా వరకు సాధు జంతువులు తమ పిల్లల జోలికి వస్తే.. తమ కన్న పదిరెట్లు పెద్దవైన జంతువుల్ని సైతం తరిమేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని ఏనుగులు తమ గున్న ఏనుగులో కలిసి మేత మేస్తున్నాయి.. అప్పుడు సింహలు వీటిని చూసి రౌండప్ చేశాయి. అంతేకాకుండా.. పిల్ల ఏనుగులపై దాడులు చేసేందుకు ప్రయత్నించాయి. ఇంతలో పిల్ల ఏనుగుల్ని కాపాడేందుకు గజరాజులు చక్రవ్యూహాంను అమలు చేశాయి.
A family of elephants see a lion and form a circle to protect their children.
— The Goddess (@TheGoddessF) February 20, 2025
ఏనుగులు చుట్టు రౌండ్ గా చేరిపోయి.. పిల్ల ఏనుగుల్ని తమ కాళ్ల మధ్యలో మిడిల్ లో ఉండేలా వాటిని నెట్టాయి. అప్పుడు నాలుగు వైపుల నుంచి.. ఏనుగులు ఘీంకరిస్తూ సింహలను దూరంగా వెళ్లేలా చేశాయి. తమ బలమైన తొండంతో సింహలను దూరంగా విసిరికోట్టాయి.
Read more: Sub inspector Video: మద్యం మత్తులో రెచ్చిపోయిన ఎస్సై.. రోడ్డు మీదే భార్యతో రాసలీలలు.. వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది . దీన్ని చూసిన నెటిజన్లు ఏనుగుల టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. మరికొందరు మహా భారతంలోని చక్రవ్యూహాంను భలే అమలుచేశాయంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి