కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలంగా 18 నెలల బకాయిల ఎరియర్ల కోసం డిమాండ్ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల బకాయిలు ఇప్పుడిక 8 వాయిదాల్లో రానుంది.
మార్చ్ 2023లో డీఏ పెంపు ప్రకటన
దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈసారి డీఏ, డీఆర్ ప్రకటన 2023 అంటే ఈ ఏడాది మార్చ్ నెలలో రావచ్చని అంచనా. అమలయ్యేది మాత్రం జనవరి 1 నుంచి కావచ్చు. ఈలోగా వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ ప్రకటించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం డీఏ, డీఆర్ ఇప్పటికే ప్రకటించింది.
20.2 శాతానికి పెరగనున్న డీఏ
తెలంగాణ ప్రభుత్వం తరపున ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ 2.73 శాతం పెరిగింది. ఈ పెంపు అనంతరం ఉద్యోగుల డీఏ 17.29 శాతం పెరిగి 20.02 శాతానికి చేరుకుంది. తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. జూలై 1, 201 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ డబ్బుల్ని ఉద్యోగుల జీపీఎఫ్ ఎక్కౌంట్లో 8 వాయిదాల్లో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
ఎవరికి ప్రయోజనం
ప్రభుత్వం డీఏ ఎరియర్ల ప్రయోజనం మే 31, 2023న రిటైర్ అయ్యే ఉద్యోగులకు కలగనుంది. ఈ ఉద్యోగులు ఉద్యోగం చివరి 4 నెలల్లో జీపీఎఫ్‌లో ఏ విధమైన వాటా కట్ చేయకుండా మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 4.4 లక్షల ఉద్యోగులు, 2.28 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
Also read: Revanth Reddy: పార్టీ ఫిరాయింపుదారులపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. వారికి ఉరి శిక్ష వేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook