Employees Salary Hike: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. భారీగా జీతాల పెంపు..

Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.

 

1 /5

Telangana Govt: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలకు, ఉద్యోగాలకు తాయిలాలు ఇచ్చే పనిలో పడింది.

2 /5

ఈ నేపథ్యంలో ముందుగా పంచాయితీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ గా జీతా భత్యాలు ఇవ్వాలని అధికారులను  ఆదేశించింది. ఆ శాఖ మంత్రి సీతక్క.

3 /5

ఆన్ లైన్ లో ఒకేసారి అందరికీ జీతాలు పడేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు పడనున్నాయి.

4 /5

దీనికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. ఆర్ధిక శాఖ క్లియరెన్స్ తర్వాత ఈ శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జీతాలు 1వ తారీఖున అకౌంట్ లో పడతాయి. దీంతో ఈ సంస్థలో పనిచేస్తోన్న 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

5 /5

ఇప్పటికే విద్యుత్ సహా కొన్ని శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే తరహాలో జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో ఎలాంటి కాంట్రాక్టర్లు లేకుండా నేరుగా జీతాలు పడతాయి. దీంతో ప్రభుత్వంపై భారీ కూడా తగ్గే అవకాశాలున్నాయి.