Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక. పెన్షనర్లు అందరూ తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ పెన్షన్ నిలిచిపోతుంది. ఎప్పటిలోగా లైఫ్ సర్ఠిఫికేట్ సమర్పించాలి, ఎలా ఇవ్వాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Pensioners Life Certificate: దేశంలోని లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు కీలకమైన అప్ డేట్ ఇది. తక్షణం అంటే నవంబర్ 30 తేదీలోగా పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. నవంబర్ 30 వరకూ జీవిత ధృవీకరణ పత్రం సమర్పించకుంటే మీ పెన్షన్ ఆగిపోతుంది. ఇప్పటి వరకూ ఈ పని పూర్తి చేయకుంటే వెంటనే ఈ ప్రక్రియ ముగించండి.
ఆధార్ కార్డు సహాయంతో డిజిటల్ రూపంలో లేదా పోస్ట్ మ్యాన్ సహాయంతో కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
బ్యాంక్, పోస్టాఫీస్ కు నేరుగా వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సమర్పిచవచ్చు. ఉమంగ్ యాప్ సహాయంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేటచ్ సమర్పించవచ్చు. జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా కూడా సమర్పించవచ్చు.
ఇప్పుడు అందులో మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఆ తరువాత అవసరమైన సమాచారాన్ని నింపాలి. ఫోన్ మందు కెమేరాతో మీ ఫోటో సమర్పించాలి. ఆ తరువాత మీ ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా జీవన్ ప్రమాణ్ పత్ర డౌన్ లోడ్ లింక్ వస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
మొబైల్ సహాయంతో ఇంటి నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ముందుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే సదుపాయం ఉంది. దీనికోసం పెన్షనర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో 5MP లేదా అంతకంటే ఎక్కువ కెమెరాతో AadhaarFaceRD జీవన్ ప్రమాఅ ఫేస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? జీవన్ ప్రమాణ్ పోర్టల్ అనేది పెన్షనర్ల కోసం బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనది. పింఛనుదారుడు బతికున్నాడా లేదా అనేది నిర్ధారించే ప్రక్రియ ఇది. .
నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే డిసెంబర్ నుంచి రావల్సిన పెన్షన్ నిలిచిపోతుంది. తిరిగి ఎప్పుడైతే సమర్పిస్తారో అప్పట్నించి బకాయిలతో సహా చెల్లిస్తారు.
ఎవరు సమర్పించాలి నిబంధనల ప్రకారం 60 - 80 ఏళ్ల వయస్సులో ఉన్న పెన్షనర్లు తప్పకుండా నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పెన్షనర్లు, ప్రభుత్వ పథకాల్లో పింఛన్ దారులు జీవిత ప్రమాణ పత్రాన్ని జీవన్ ప్రమాణ్ పోర్టల్, ఫేస్ అథెంటిఫికేషన్, పోస్టాఫీసులు, బ్యాంకులు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా సమర్పించవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లు తాము బతికున్నామని నిరూపించుకునే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30 తేదీలోగా ఈ ప్రమాణ పత్రం సమర్పించకుంటే పెన్షన్ నిలిచిపోతుంది. ఎప్పుడైతే సర్టిఫికేట్ సమర్పిస్తారో అప్పుడే తిరిగి పెన్షన్ చెల్లించబడుతుంది.