Aghori naga sadhu sensational comments on sanatana dharma: సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం తర్వాత ఒక అఘోరీ నాగ సాధు వచ్చారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణలో హాట్ టాపిక్ గామారిందని చెప్పుకొవచ్చు. సనాతన ధర్మం కోసం తన ప్రాణ త్యాగానికి కైన సిద్దమంటూ కూడా మీడియాల్లో ఉపన్యాసాలు ఇస్తు రచ్చ చేశారు. అంతే కాకుండా.. సికింద్రాబాద్ లో ఘటనకు కారణమైన వ్యక్తిని అక్కడే బలివ్వలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో అఘోరీ కొండగట్టు, వేముల వాడ ఆలయాలకు వెళ్లారు. వేములవాడకు వెళ్లినప్పుడు అక్కడున్న దర్గాపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం కోసం హిందువులంతా ఒక్కటవ్వాలన్నారు. మరోవైపు ముస్లింలపై కూడా అఘోరీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. తెలంగాణ పోలీసులు దీపావళి రోజు అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటానని వ్యాఖ్యలు చేయడంతో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకుని మంచిర్యాలలోని కుశ్నపల్లిలో ఆమె ఇంటికలో నిర్భందించారు.
చివరకు బందోబస్తుగా ఉన్నారు. చివరకు కార్తీక మాసం అని.. తన పూజలకు ఆటంకం కల్గజేస్తే లేని విపత్తులు వస్తాయని చెప్పడంతో పోలీసులు రెండు రోజుల క్రితం అఘోరీని కర్ణాటక కేరళ బార్డర్ లో తీసుకెళ్లి వదిలేశారు. ఇంతలో అఘోరీ మళ్లీ ఈ రోజు ఏపీలో కన్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఏపీలో అఘోరీకి ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తొంది.
పూర్తి వివరాలు..
అఘోరీ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నం దగ్గర వేంపాడు టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు అఘోరీ చెప్పుకొవచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక వీడియో సైతం విడుదల చేశారు. తనను వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఒక టోల్ సిబ్బంది తన ఛాతీ మీద చెయ్యివేసి తోసేశాడని, ఒక నాగసాధు మీద ఛాతీ మీద చెయ్యివేయడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు.
తనకే సెఫ్టీలేనప్పుడు.. మిగత మహిళలు, అమ్మాయిల పరిస్థితి ఏంటని కూడా అఘోరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన హిందువులంతా మేల్కొని మన ఇంట్లోని మహిళలు, ఆడవాళ్లను, మన ధర్మంను మనమే కాపాడుకోవాలని కూడా పిలుపు నిచ్చారు. మరోవైపు అక్కడున్న పోలీసులు టోల్ ప్లాజా వ్యక్తితో సారీ చెప్పించినట్లు తెలుస్తొంది.
రేప్ లు చేసి, మహిళలపట్ల ఇష్టమున్నట్లు ప్రవర్తించి సారీ లు చెబితే వదిలేయాలా అంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఘోరీ నాగ సాధు మాత వ్యవహారం ప్రస్తుతం మళ్లీ వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. మన ఇంటిని, మహిళల్ని, మన ధర్మంను మనమే కాపాడుకొవాలంటూ కూడా పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.