Technical fault in Hyderabad metro train video: హైదరాబాద్ లో ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలే సోమవారం అది కూడా ఉదయం పూట మెట్రో ట్రైన్ లో రద్దీ ఏవిధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో మెట్రోరైళ్లలో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు వచ్చినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మార్గాలలో మెట్రో రైళ్లలో సేవలకు అంతరాయం కల్గినట్లు సమాచారం.
#Hyderabad----
Metro services disrupted for a while in #Hyderabad due to a technical glitch on Monday.
Affected route-- & #LBNagar- #Miyapur
Office goers are the worst affected due to the disruption in Metro services.@ltmhyd metro officials said that a technical glitch in… pic.twitter.com/ZzMsc6TSeY
— NewsMeter (@NewsMeter_In) November 4, 2024
దీంతో ప్రయాణికులు తమ ఆఫీసులకు సమయానికి వెళ్లలేక తీవ్ర అవస్థలు పడినట్లు తెలుస్తొంది. అయితే.. చాలా మంది తమ ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లిన వారు ఆలస్యంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెట్రో టెక్నికల్ సిబ్బంది ప్రస్తుతం మెట్రోలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మళ్లీ యథావిధిగా మెట్రో రైలు ప్రారంభమయ్యాయి. కానీ దాదాపు గంట పాటు ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలుస్తొంది.
కొందరు మెట్రో ప్రయాణికులు తము పడుతున్న అవస్థలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు కొందరు ప్రయాణికులు మాత్రం.. మెట్రో అంటూ ఆర్బాటాలు చేస్తున్నారు.
కనీసం మెట్రోల్లో ఉండాల్సిన సదుపాయాలు కల్పించడంలేదని, టెక్నికల్ సమస్యలు తలెత్తగానే చాలా సేపు ఏమైందో అని ఆందోళన చెందామని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సోమవారం మెట్రోట్రైన్ లో సమస్య తలెత్తడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.