Vangalapudi Anitha First Reaction Deputy CM Pawan Kalyan Comments: హోంమంత్రి పోస్టును ఇచ్చేయాలని తనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల్లోనే హోంమంత్రి అనిత స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు స్పందించకుండా ఇతర విషయాలపై ఆమె మాట్లాడారు. తిరుమలలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నేరాలు తీవ్రం: రోజురోజుకు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి నేరాలు చోటుచేసుకుంటున్నాయి.
డిప్యూటీ సీఎం కలకలం: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు పెరగడం.. ప్రజల్లో ఆగ్రహం నిండుకుంటుండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించి 'హోంమంత్రిగా నేనే అవుతా' అని ప్రకటించిన విషయం తెలిసిందే.
హోం శాఖ: 'అవసరమైతే హోంమంత్రి నేనే తీసుకుంటా' అని పవన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు.
నిరాకరణ: తిరుమలను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు.
రాష్ట్రం సుభిక్షం: 'తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సరితూకంతో ముందుకు సాగేలా శ్రీవారిని ప్రార్థించా' అని హోంమంత్రి అనిత తెలిపారు.
పవన్‌పై మౌనం: ఈ విషయాలను తన సామాజిక మాధ్యమాల్లో హోంమంత్రి అనిత పంచుకున్నారు. కానీ హోంమంత్రిగా తన పనితనంపై డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు.
ఈఓకు విజ్ఞప్తి: తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ ఈఓ శ్యామలరావుతో హోంమంత్రి అనిత సమావేశమై వినతిపత్రం ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని కల్కి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అనిత విజ్ఞప్తి చేశారు.