Gold Rate Today:బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా తగుతూ వస్తున్నాయిజ నవంబర్ 5వ తేదీ మంగళవారం బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే దాదాపు 200 రూపాయలు తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74200 రూపాయలుగా ఉంది.
Gold Rate Today: బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా తాజాగా ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది ఫలితంగా బంగారం నుంచి స్టాక్ మార్కెట్లలోకి డబ్బు తరలి వెళ్లే అవకాశం ఉంది.
దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరైతే బంగారం లో పెట్టుబడి పెట్టారో ఆ ఇన్వెస్టర్లు తమ లాభాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా బంగారం ధరల తగ్గింపునకు దారి తీసే అవకాశం ఉంటుంది.
అయితే బంగారం ధరలు ఇలా వరుసగా ఎంతకాలం తగ్గవచ్చు అని చాలామందిలో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే బంగారం ధరలు ప్రస్తుతం కొద్దిగా రిలీఫ్ మాత్రమే అందిస్తున్నాయని దీర్ఘకాలంలో రిలీఫ్ అందించే అవకాశం కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు మరింత ట్రిగర్ అయ్యే అవకాశం ఉందని అందుకు కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్ ఇరువురు మధ్య హోరా హోరీగా పోరాటం సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో కమలహరిస్ కొద్దిగా స్వల్ప ఆధిక్యంతో కనిపిస్తున్నారు.
అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే క్రిప్టో కరెన్సీ పైన ఎక్కువగా దృష్టి సారిస్తారని, చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తారని మార్కెట్లో భావిస్తున్నాయి.
దీంతో స్టాక్ మార్కెట్లలో కొద్దిగా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో మళ్లీ ఇన్వెస్టర్లు బంగారం వైపు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వస్తున్నాయి.
అయితే బంగారం ధరలు వచ్చే సంవత్సరం మాత్రం ఒక లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే.