NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా NEET పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఈసారి నీట్ పరీక్షలో మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. జేఈఈ తరహాలోనే నీట్ పరీక్షను కూడా రెండంచెల్లో నిర్వహించాలని రాథాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
నీట్ పరీక్షతో పాటు ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల్లో కూడా కీలక మార్పులు రావచ్చు. ముఖ్యంగా నీట్ పరీక్షపై జరుగుతున్న వివాదాల నేపధ్యంలో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పరిస్థితి మరీ శృతి మించింది. నాలుగు సార్లు ఫలితాలు ప్రకటించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో నీట్‌తో పాటు ఇతర జాతీయ పరీక్షల విధానంలో మార్పు చేర్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ ఛీఫ్ రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది.
ఈ కమిటీ నివేదిక ప్రకారం నీట్ యూజీ పరీక్షలో మార్పులు తప్పవని తెలుస్తోంది. పరిమితమైన వైద్య విద్యా సీట్ల కోసం 25 లక్షలమంది పోటీ పడుతుండటంతో ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. అందుకే నీట్లో కూడా జేఈఈ తరహాలోనే రెండంచెల పరీక్షను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసింది. అంటే మొదటి దశ జేఈఈ మెయిన్స్ తరహాలో స్క్రీనింగ్ పరీక్షగా ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే రెండవ దశ రాయడానికి వీలుంటుంది. దీనివల్ల విద్యార్ధుల్ని భారీగా ఫిల్టర్ చేయవచ్చు. ఫలితంగా రెండవ దశలో పరీక్షా కేంద్రాలపై భారం కూడా తగ్గుతుందని కమిటీ సూచించింది.
పేపర్ లీకేజ్ వ్యవహారం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టేందుకు రాధాకృష్ణన్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. దశలవారీగా ఆన్లైన్ పరీక్షకు మారాలని తెలిపింది. పూర్తిగా ఆన్ లైన్ పరీక్ష సాధ్యం కాకుంటే హైబ్రిడ్ మోడల్ సిపారసు చేసింది. అంటే ప్రశ్నాపత్రాలు డిజిటల్ రూపంలో పరీక్షా కేంద్రాలకు వెళ్తాయి. విద్యార్ధులు పేపర్‌పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేపర్ లీకేజ్ అరికట్టవచ్చని కమిటీ అభిప్రాయపడింది. ప్రింటింగ్ ప్రెస్, స్ట్రాంగ్ రూమ్ స్టోరేజ్, సెక్యూరిటీ, ట్రాన్సిట్ దశల అవసరం ఉండకపోవచ్చు.
మరో సూచన ప్రకారం నీట్ తొలి దశ అంటే స్క్రీనింగ్ ఆన్లైన్ విధానంలో నిర్వహించి తుది దశను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే నీట్ పరీక్ష రెండంచెల్లో జరగనుంది. అయితే 2025 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారా లేక 2026 నుంచి అమలు చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.