/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Yogini Ekadashi 2022 Vrat Rules:  ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. ఇది కష్టతరమైన ఏకాదశి ఉపవాసాల్లో ఒకటి. ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈసారి యోగినీ ఏకాదశి వ్రతం (Yogini Ekadashi 2022) జూన్ 24 శుక్రవారం నాడు వచ్చింది. 

నియమాలను సక్రమంగా పాటించినప్పుడే ఏకాదశి ఉపవాసం యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది. దశమి తిథి నుండి ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుంది మరియు ద్వాదశి రోజున పారణ జరుగుతుంది. ఈ రోజు ఆహారం మరియు పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. యోగినీ ఏకాదశి రోజున ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏకాదశి వ్రతంలో వీటిని తినకండి
>> మీరు యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే... ఈ రోజున కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోకండి.  ఏకాదశి నాడు అన్నం, ధాన్యాలు తినకండి. ఈ రోజున అన్నం తినడం వల్ల వచ్చే జన్మలో పాకులాడే పురుగుగా మారతారని అంటారు.
>> ఏకాదశి వ్రతంలో ఉప్పు తినడం నిషిద్ధం. అలాగే, ఈ రోజు టీ కూడా తీసుకోవద్దు.
>> యోగినీ ఏకాదశి రోజున ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి మొదలైనవి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. మరియు ఉపవాస ఫలం లభించదు.

ఏకాదశి నాడు వీటిని తినండి
>> ఏకాదశి రోజున పాలు, పెరుగు, పండ్లు మొదలైన వాటిని తినవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువుకు పండ్లు లేదా స్వీట్లను సమర్పించండి.
>> జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు అనారోగ్యంతో ఉంటే లేదా ఉపవాస నియమాలను పాటించలేకపోతే, మీరు బంగాళాదుంపలు, బుక్వీట్ కుడుములు లేదా పూరీలను తినవచ్చు.

సమయానుకూలంగా పారణ చేయండి
ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి రోజున మాత్రమే శుభముహూర్తంలో విరమించాలి. సమయానుకూలంగా పారణ చేయకుంటే వ్రతానికి తగిన ఫలం లభించదు. ఏకాదశి ఉపవాసంలో పారణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు.

Also Read: Sawan Shivratri 2022: శ్రావణ శివరాత్రి రోజున శివుడిని ఇలా పూజిస్తే.. అంతులేని సంపద మీ సొంతం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Yogini Ekadashi on 24 June 2022: don't eat these things in eakdashi vrat
News Source: 
Home Title: 

Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున వీటిని తినకండి, లేకుంటే మీకే నష్టం!

Yogini Ekadashi 2022:  యోగినీ ఏకాదశి రోజున ఏమి తినాలి? ఏమి తినకూడదు?
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రేపే (జూన్ 24) యోగినీ ఏకాదశి

ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు
 

Mobile Title: 
Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున వీటిని తినకండి, లేకుంటే మీకే నష్టం!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, June 23, 2022 - 14:00
Request Count: 
63
Is Breaking News: 
No