Yogini Ekadashi 2022: యోగిని ఏకాదశి వ్రతం ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వపాపాలు నశించి, మరణానంతరం స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. అంతే కాదు, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన సమానమైన ఫలం లభిస్తుందట. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి యోగినీ ఏకాదశి (Yogini Ekadashi 2022) ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను చెప్పినట్లు తెలుస్తోంది. యోగిని ఏకాదశి ఉపవాస తేదీ, పూజ ముహూర్తం మరియు పారణ సమయం గురించి తెలుసుకుందాం.
యోగిని ఏకాదశి 2022 తేదీ
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూన్ 23, గురువారం రాత్రి 09:41 గంటలకు ప్రారంభమై... జూన్ 24 శుక్రవారం రాత్రి 11.12 గంటల వరకు ఉంటుంది. అంటే జూన్ 24, శుక్రవారం నాడు యోగినీ ఏకాదశి అన్నమాట.
ముహూర్తం
ఈ రోజు ఉదయం 09 నుండి 09.40 వరకు. ఆ తర్వాత శుభ యోగం ప్రారంభమవుతుంది. జూన్ 24న జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 06.32 వరకు. ఈ రోజు శుభ సమయం లేదా అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:49 వరకు.
పారణ సమయం
జూన్ 24న యోగినీ ఏకాదశి వ్రతం పాటించేవారు జూన్ 25వ తేదీ శనివారం ఉదయం 05:41 నుండి 08:12 వరకు ఉపవాసం ఉంటారు. ఈ రోజు ఉదయం 5:41 గంటలకు హరి వాసర్ ముగుస్తుంది.
యోగిని ఏకాదశి ప్రాముఖ్యత
ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి నాడు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యోగినీ ఏకాదశి గురించి చెప్పాడు. యోగినీ ఏకాదశి వ్రతం ఆచరించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. భూమిపై అతని పాపాలు నశించి తర్వాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు. మరణానంతరం స్వర్గానికి వెళతాడు.
Also Read: Sun Line in Palm: అరచేతిలో సూర్యరేఖ ఇలా ఉంటే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Yogini Ekadashi 2022: యోగిని ఏకాదశి ఎప్పుడు? దాని ప్రాముఖ్యత ఏంటి?