Viral Video Today: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తే...మరికొన్ని భయం పుట్టిస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal Videos) నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, కుక్కలు, పులులు, సింహాలు వంటి యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో చూసేద్దాం రండి.
మనం సాధారణంగా మనుషులు కలిసి దొంగతనం చేయడం చూసి ఉంటాం. కానీ జంతువులు కూడా కలిసి దొంగతనం చేస్తాయని ఈ వీడియో చూస్తేనే అర్థమయింది. ఈ వీడియోలో ఓ కుక్క, కోతి కిరాణా దుకాణానికి వెళ్తాయి. అక్కడ వేలాడి ఉన్న చిప్స్ ను అందుకోవడానికి వానరం ప్రయత్నిస్తుంది. అయితే వీలుకాకపోవడంతో కుక్కపైకి ఎక్కి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో (Viral Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. 'తోడు దొంగలు' అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను Tarana Hussain అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
The 🐒 trying to pick up a packet of chips with the help of 🐕 is the cutest thing you will watch today ❣️❣️. #goodmorning #dog #dogs #monkey #monkeys #animal #AnimalLovers #cute #lovable #adorable #friendship #bond #team pic.twitter.com/bkMAEU13NC
— Tarana Hussain (@hussain_tarana) May 8, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Funny Video: చిప్స్ దొంగలించడానికి కోతికి సాయం చేస్తున్న కుక్క, వీడియో వైరల్