Will Smith in Oscars 2022: ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సంలో విల్ స్మీత్.. స్టేజ్‌పైనే క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో 'ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఏఎంపీఏఎస్)' స్పందించింది.
'ఏ విధమైన హింసను అకాడమీ సహించదు. ఈ రాత్రి 94వ అవార్డుల వేడుక జరుపుకుంది. సహచరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల నుంచి గుర్తింపు పొందటం మంచి విషయం' అని చెప్పుకొచ్చింది. అయితే విల్ స్మిత్ అలా ప్రవర్తించడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అనే విషయంపై మాత్రం అకాడమీ స్పష్టతనివ్వలేదు.
ఇంతకీ విల్ స్మీత్ ఎందుకలా చేశాడు?
94వ ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా.. ఆస్కార్ గెలుపొందారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో స్టేజ్‌పై హాలీవుడ్ కమేడియన్ క్రిస్ రాక్ మాట్లాడుతూ.. విల్ స్మీత్ భార్యపై జోకు వేశారు. దీనితో అది నచ్చని విల్ స్మిత్ స్టేజ్‌పైకి ఎక్కి.. క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించారు. ఆ తర్వాత ఒక్క క్షణం మౌనంగా ఉన్న క్రిస్ రాక్ తిరిగి మాటల్లో మునిగిపోయాడు. విల్ స్మిత్‌తో స్టేజ్‌పై నుంచే మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. విల్ స్మీత్ స్టేజ్ కింద నుంచి కూడా క్రిస్ రాక్ మాటలకు కోపంగానే సమాధానిమచ్చారు.
Damn. So did Will Smith just punch Chris Rock for real? Here is a Japanese network’s uncensored exchange between Will Smith and Chris Rock. #Oscars #WillSmith pic.twitter.com/fjqgypVdue
— Eric Feigl-Ding (@DrEricDing) March 28, 2022
అయితే ఆ తర్వాత విల్ స్మిత్ క్రిస్ రాక్‌కు, అకాడమికీ క్షమాపణలు కూడా చెప్పారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. విల్ స్మిత్ అలా చేయకుండా ఉండాల్సిందని కొందరు కామెంట్స్ చేస్తుంటగా.. విల్ స్మిత్ మంచి పని చేశాడండూ పలువురు సపోర్ట్ చేస్తున్నారు.
Also read: Krishna Vrinda Vihari: 'కృష్ణ వ్రి౦ద విహారి' సినిమా టీజర్ విడుదల.. ఎలా ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Will Smith in Oscars 2022: ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ ప్రవర్తనపై అకాడమి స్పందన!
ఆస్కార్ వేడుకల్లో అనూహ్య పరిణామం
స్టేజ్‌పైనే కమేడియన్ను కొట్టిన విల్ స్మిత్
ఘటనపై స్పందించిన అకాడమి