Zodiac Signs of Billionaires: ప్రపంచంలోని టాప్ బిలియనీర్స్ రాశులేంటో మీకు తెలుసా...

Zodiac Signs of Top Billionaires: సంపన్నులు, సెలబ్రిటీల లైఫ్ స్టైలే కాదు... వారి రాశులు, జాతకాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కొందరిలో ఉంటుంది. ప్రపంచంలోని పలువురు టాప్ బిలియనీర్స్‌‌ ఏ రాశికి చెందినవారో ఇక్కడ తెలుసుకోండి...  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 12:56 PM IST
  • టాప్ బిలియనీర్స్ రాశుల వివరాలు
  • బిల్ గేట్స్ రాశి 'వృశ్చికం'
  • మార్క్ జుకర్ బర్గ్ రాశి 'వృషభం'
 Zodiac Signs of Billionaires: ప్రపంచంలోని టాప్ బిలియనీర్స్ రాశులేంటో మీకు తెలుసా...

Zodiac Signs of Top Billionaires: సంపన్నుల జీవితాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. జీవితంలో వారు ఆ స్థాయికి ఎలా ఎదిగారు... వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది... తదితర అంశాలు సామాన్యులకు ఆసక్తిని కలిగిస్తుంటాయి. కొంతమంది.. సంపన్నుల రాశులు, జాతకాల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తారు. తమ రాశులు, జాతకం వారితో ఏమైనా మ్యాచ్ అవుతున్నాయేమోనని చెక్ చేసుకుంటారు. మీరు కూడా అదే కోవకి చెందినవారైతే ఇది మీకోసమే. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ బిలియనీర్స్‌గా ఉన్న పలువురు వ్యక్తుల రాశులేంటో తెలుసుకుందాం...

Bill Gates: ప్రపంచంలోని టాప్ బిలియనీర్లలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాశి 'వృశ్చికం'.  బిల్ గేట్స్ నికర ఆస్తుల విలువ సుమారు $137 బిలియన్లు.

Elon Musk: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం 'టెస్లా' కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ రాశి 'కర్కాటకం'. అతని ఆస్తుల విలువ సుమారు $278 బిలియన్లు.

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రాశిచక్రం 'మకరం'. బెజోస్ నిరక ఆస్తుల విలువ సుమారు $202 బిలియన్లు.

Mark Zuckerberg: టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ రాశిచక్రం 'వృషభం'. జుకర్ నికర ఆస్తుల విలువ సుమారు $121 బిలియన్లు.

Larry Page and Sergey Brin : గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్,సెర్గీ బ్రిన్ కూడా ప్రపంచ టాప్ బిలియనీర్స్‌గా కొనసాగుతున్నారు. లారీ పేజ్ రాశి 'మేషం'. సెర్గీ బ్రిన్ రాశి 'సింహం'. లారీ పేజ్ ఆస్తుల విలువ సుమారు  $131 బిలియన్లు. సెర్గీ బ్రిన్ ఆస్తుల విలువ సుమారు $126 బిలియన్లు.

Also Read: Nitin - Shalini: నితిన్ కేక్ క‌ట్ చేస్తుండ‌గా.. కిటికీలోంచి చూసి సంబరపడిన ఆయ‌న‌ సతీమణి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Trending News