సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు (Electricity Bill) వందల్లోనే, లేక కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో రావడం చూస్తుంటాం. కానీ లాక్డౌన్ వేళలో ఓ వ్యక్తి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎందుకంటే విద్యుత్ అధికారుల నిర్వాకంతో ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.80లక్షల కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ నిర్వాహక సిబ్బంది ఏకంగా రూ.80లక్షల కోట్ల (80 Lakh crore Power Bill) కరెంట్ బిల్లును చేతిలో పెట్టడంతో ఆశ్చర్యపోవడం ఇంటి యజమాని వంతయింది. ఎన్ని అంకెలున్నాయో లెక్కించేందుకే కష్టంగా ఉందని యజమాని అంటున్నాడు. భారీగా పెరిగిన బంగారం ధర
దాదాపు కొన్ని దేశాల బడ్జెట్ తరహాలో వచ్చిన కరెంట్ బిల్లుపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా నిరాశే ఎదురైంది. బిల్లును సరిచేసి సరైన కరెంట్ బిల్లు ఇవ్వాలని కోరగా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆ ఇంటి యజమాని వాపోయాడు. కరెంట్ బిల్లును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్