Kasturi Controversial comments: ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నటి కస్తూరి శంకర్.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనితో క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేయగా.. తాను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ.. తెలిపింది కస్తూరి శంకర్
అన్నమయ్య సినిమా ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయం అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి కస్తూరి శంకర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగానే కాకుండా తమిళనాడులో బిజెపి మహిళా నాయకురాలిగా కూడా పేరు సంపాదించింది కస్తూరి. అయితే ఇటీవలే బిజెపి సమావేశంలో ఈమె ప్రసంగం లో మాట్లాడిన మాటలు పెను దుమారాన్ని సృష్టించాయి
తెలుగు వారి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాలకు దారితీస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 400 యేళ్ళ క్రితం రాజులు, మహారాజుల కాలంలో.. తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి.. అంతఃపురంలో మహిళలకు సైతం సేవలు చేసేవారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదంగా మారాయి.
ముఖ్యంగా ఈ వ్యాఖ్యల పైన తెలుగు , రాజకీయ నేతలు కూడా తీవ్రంగా ఫైర్ అవుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు.. ఈ విషయం పైన నటి కస్తూరి కూడా తను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. తెలుగువారిని తాను అవమానించలేదని, తెలుగు తనకు మెట్టినిల్లు వంటిది అంటూ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేసింది. తెలుగు వారంతా కూడా తన కుటుంబ సభ్యులేనని , తన పైన చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటూ తెలియజేసింది.
అంతేకాకుండా తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. తమిళ మీడియాలో తన మాటలను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్న వార్తలను ఎవరు కూడా నమ్మవద్దు అంటూ కోరింది. ముఖ్యంగా డిఎంకె తన వ్యాఖ్యలను ఇలా వక్రీకరిస్తోంది అంటూ తెలియజేసింది నటి కస్తూరి. తన గురించి తెలుగు వ్యతిరేకిని అంటూ విష ప్రచారం చేస్తున్నారని, కావాలని నెగెటివిటీ వచ్చేలా చేసేందుకే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ కస్తూరి వాపోతోంది.
ఒక ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన కొంతమంది ముందు నోటికొచ్చినట్టు వాగడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఇలాంటి కొంతమంది సెలబ్రిటీలకు కామన్ అయిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా కస్తూరి శంకర్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ మరి కొంతమంది నిట్టూరుస్తున్నారు.